అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలకు మద్దతుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర ముంబయిలోని చారిత్రక శివాజీ మహారాజ్ టెర్మినల్‌ను గులాబీ విద్యుద్దీపాలతో అలంకరించారు. విద్యుద్దీపాల వెలుగులో ఛత్రపతి శివాజీ టెర్మినల్ గులాబీమయంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్ కూడా విద్యుద్దీపాల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నోయిడాలో మహిళా దినోత్సవం సందర్భంగా పింక్ మారథాన్ నిర్వహించారు. ఈ మారధాన్‌లో భారీ సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.


దిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆల్ ఇండియా ఉమెన్ ఫిట్ వాకథాన్‌ను కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. ఇందులో భారీ సంఖ్యలు మహిళలు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన భద్రతా సిబ్బంది మొత్తాన్ని మహిళలనే నియమించారు. మహిళా డ్రైవర్ నడిపిన వాహనంలో వచ్చిన చౌహాన్ మహిళా పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. వారి సమస్యలను తెలుసుకున్నారు.

దిల్లీలో మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: విస్తృత అవకాశాలతోనే అసమానతలు దూరం
యుద్ధ రంగంలో శివంగిలా.. యువతకు ఆదర్శంగా
పుస్తకాలు చదివి సేద్యం.. రోజుకు రూ.1500 సంపాదన!