ETV Bharat / bharat

'రైతు పోరుపై కేంద్రం మౌనం.. కుట్రకు సంకేతం'

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న అన్నదాతలపై ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు బీకేయూ నేత రాకేశ్ టికాయిత్​. నిరసనలపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం మౌనంగా ఉండటమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Govt's silence indicates it is planning steps against farmers' stir: Tikait
'రైతు ఆందోళనపై కేంద్రం మౌనానికి అర్థం అదేనా?'
author img

By

Published : Mar 1, 2021, 5:00 PM IST

రైతుల నిరసనలపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం మౌనంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాజేశ్​ టికాయిత్​. ఇది సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతుల్లో గందరగోళాన్ని సృష్టించడానికి సంకేతమని ఆరోపించారు టికాయిత్​.

"15-20 రోజుల నుంచి రైతుల ఆందోళనలపై కేంద్రం మౌనం వహించడం చూస్తే... నిరసనలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సమస్యకు పరిష్కారం లభించేవరకు అన్నదాతలు వెనక్కి తగ్గరు" అని అన్నారు టికాయిత్.

రైతులు.. అటు వ్యవసాయాన్ని, ఇటు ఆందోళనలను ఒకేసారి చేయగలరని.. ఇందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని టికాయిత్​ పేర్కొన్నారు. రైతులతో చర్చలను పునరుద్ధరించాలన్న ఆయన.. కేంద్రం తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు.

ఇదీ చూడండి: దేశవ్యాప్త 'మహా పంచాయత్'ల షెడ్యూల్ ఖరారు​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.