ETV Bharat / bharat

టీకా​ కోసం ఈ వారమే భారత్​ బయోటెక్​తో ఒప్పందం

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ కోసం భారత్​ బయోటెక్​, సీరం సంస్థలతో కేంద్రం వేర్వేరుగా ఈ వారమే ఒప్పందాలు కుదుర్చుకోనుంది. కొద్దిరోజుల్లోనే కరోనా టీకా పంపిణీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఐసీఎంఆర్​ పరిశోధకులు వెల్లడించారు.

Govt to sign 2 separate MoU with SII and Bharat Biotech
వ్యాక్సిన్ల కోసం ఈ వారమే కేంద్రం ఒప్పందం
author img

By

Published : Jan 4, 2021, 3:49 PM IST

కరోనా టీకాలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. వ్యాక్సినేషన్​ కోసం సీరం సంస్థ, భారత్​ బయోటెక్​తో కేంద్రం వేర్వేరుగా అవగాహన ఒప్పందాలను ఖరారు చేసుకోనుంది. ఈ ప్రక్రియ వారంలోపే జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: కొవాగ్జిన్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్.. త్వరలోనే పంపిణీ

భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకా.. క్లినికల్​ ట్రయల్స్​ సంతృప్తికరంగా ఉన్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)​ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్​ సమర్థంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్​ అడ్వైజర్​ డా. సునీలా గార్గ్ ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో​ స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి ఒక్కో డోసు రూ. 200, ప్రైవేటు వారికి రూ. 1000 వరకు ఉండొచ్చని ఆమె తెలిపారు.

కేంద్రానికి రూ.200..ప్రైవేటులో..?

తాము ఉత్పత్తి చేస్తోన్న కరోనా వైరస్ టీకా 'కొవిషీల్డ్‌'ను ప్రభుత్వానికి ఒక్కో డోసు రూ.200 చొప్పున విక్రయిస్తామని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. ప్రభుత్వం అనుమతించిన తర్వాత ప్రైవేటు మార్కెట్లో విక్రయించే సమయంలో దాని విలువ రూ.1000గా ఉంటుందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకాను భారత్‌లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది.

ఇదీ చూడండి: టీకా అనుమతులు వచ్చేశాయ్​.. పంపిణీ ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.