పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడం పట్ల బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన ధరలు పెరగడం వల్ల పేదలు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే కేంద్రం దీనిపై దృష్టి సారించి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
''పెట్రో ధరలపై ప్రభుత్వ నియంత్రణ తొలగిన తర్వాత.. అడ్డగోలుగా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీని వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని సమస్యకు పరిష్కారాన్ని వెతకాలి.''
- మాయావతి, బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్
ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు పన్నులు విధించడం వల్ల పెట్రో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని మాయావతి అన్నారు. సంక్షేమ రాజ్యంలో అలా ధరలు పెరిగేందుకు సూత్రాన్ని ఏమన్నా రాజ్యాంగం అనుమతిస్తుందా? అని ప్రశ్నించారు.
వరుసగా 12 రోజుల పాటు పెరిగిన పెట్రోల్ ధరలు ఆదివారం మాత్రం స్థిరంగా ఉన్నాయి.
ఇదీ చూడండి: ప్రైవేటీకరణతో మరిన్ని ఉద్యోగాలు: అనురాగ్