ETV Bharat / bharat

'లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం'

రైతు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్​ చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్​. మధ్యప్రదేశ్‌ షియోపుర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. అవసరమైతే ఆ డిమాండ్‌ కోసం లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నడిపేది దేశాన్ని కాదని, కంపెనీ అని విమర్శించారు.

Govt running company, not nation: Rakesh Tikait
'లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం'
author img

By

Published : Mar 9, 2021, 11:18 AM IST

నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్ మరోమారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఆ డిమాండ్‌ కోసం లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్‌లోని షియోపుర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో వెల్లడించారు.

'అధికారాలు లేని నాయకుడు'

'మూడు సాగు చట్టాల రద్దు డిమాండ్‌ కోసం అవసరమైతే లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం. ఇప్పటికే గణతంత్ర దినోత్సవం రోజున 3,500 ట్రాక్టర్లతో దిల్లీలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అవన్నీ అద్దెకు తెచ్చిన ట్రాక్టర్లు కావు' అని టికాయిత్ అన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌ స్థానిక భాజపా నేత, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేరు ప్రస్తావించకుండా టికాయిత్ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. 'మీరు ఎన్నుకున్న నాయకుడికి ఎలాంటి అధికారాలు లేవు. ఆయన సొంతంగా ఎప్పుడూ సమాధానం ఇవ్వలేరు. చర్చలకు సైతం ఫైల్స్‌ పట్టుకుని వచ్చి, వాటి ఆధారంగానే సమాధానాలు ఇస్తారు' అని టికాయిత్ విమర్శలు చేశారు.

కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్‌ నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాకేశ్‌ టికాయిత్ ఈ రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు పర్యటించి రైతులతో సమావేశమవుతున్నారు. మధ్యప్రదేశ్‌ పర్యటనలో భాగంగా.. మార్చి 14న రెవా, మార్చి 15న జబల్‌పుర్‌ ప్రాంతాల్లోని రైతు ర్యాలీల్లో పాల్గొననున్నారని బీకేయూ మధ్యప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి అనిల్‌ యాదవ్‌ తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ టికాయిత్ పర్యటించి రైతులతో సమావేశం కానున్నట్లు యాదవ్‌ వెల్లడించారు.

'వారికి లాభం చేకూర్చేందుకే..'

"కేంద్ర ప్రభుత్వం నడిపేది దేశాన్ని కాదు.. కంపెనీని. బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేందుకే.. కేంద్రం పనిచేస్తోంది. దోపిడీదారుల నుంచి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతులు ఆందోళనలు చేయకపోతే.. భవిష్యత్​లో ఇలాంటి చట్టాలు మరిన్ని వస్తాయి. ప్రస్తుతం దేశంలో దోపిడీదారుల ప్రభుత్వం రాజ్యమేలుతోంది."

-- రాకేశ్​ టికాయిత్​, భారతీయ కిసాన్ యూనియన్ నేత

పెరిగిన పెట్రోల్​, డీజిల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు టికాయిత్. పెట్రల్​ ధరలను పెంచి ప్రజలను మంటల్లోకి నెట్టిన కేంద్రం.. ఇప్పుడు ప్రజలను తప్పుపడుతోందని మండిపడ్డారు.

ఇదీ చదవండి : సాగు చట్టాలపై మహిళా రైతుల పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.