సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఏడాదిన్నర పాటు సాగు చట్టాల అమలును నిలిపివేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై కర్షక నేతలు సానుకూలంగా స్పందిస్తేనే ఈ చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.
"అన్నదాతలతో ప్రభుత్వం మర్యాదపూర్వకంగా చర్చలు జరుపుతోంది. ఇప్పటికీ... రైతు నేతలు స్పందిస్తే వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది."
-తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.
సాగు చట్టాలను రద్దు చేయకపోతే... 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్‌ను చుట్టుముడతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. 'పార్లమెంట్ ఘోరావ్' పిలుపుపై తోమర్ ఈ విధంగా స్పందించారు.
ఇప్పటికే కేంద్రం, కర్షక నేతల మధ్య 11 దఫాల చర్చలు జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఎర్రకోట ఘటన అనంతరం ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగడంలేదు.
ఇదీ చదవండి:'అల్లర్ల సృష్టిలో మోదీ నం.1- చివరకు ట్రంప్ పరిస్థితే!'