ETV Bharat / bharat

దివ్యాంగుల కోసం ప్రత్యేక వర్సిటీ - కేంద్రం ప్రణాళిక - దివ్యాంగులు

దివ్యాంగుల విద్య, పునరావాస శాస్త్ర బోధనకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు' యూనివర్సిటీ ఆఫ్ డిసెబిలిటీ స్టడీస్​ అండ్ రిహాబిలిటేషన్​ సైన్స్​స్​, 2021' అనే పేరుతో ఒక ముసాయిదాను తయారు చేసింది కేంద్ర సామాజిక న్యాయ శాఖ.

Govt proposes to set up University of Disability Studies and Rehabilitation Sciences
దివ్యాంగుల విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం
author img

By

Published : Dec 26, 2020, 5:41 PM IST

దివ్యాంగుల విద్య, పునరావాస శాస్త్ర బోధనలో దేశంలోనే తొలి విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనపై విద్యావేత్తలు, మేథావులు, విద్యార్థులు అభిప్రాయాలను జనవరి 3లోపు తెలపాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

అసోంలోని కామరూప్ ​జిల్లాలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. దివ్యాంగుల విద్య, పునరావాస శాస్త్రానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ నుంచి పరిశోధన వరకు ఇక్కడ బోధన ఉండనుంది. ఆడియాలజీ, మూగవారు మాట్లాడే మెళకువ, మానసిక శాస్త్రం, నర్సింగ్ సహా 8 రకాలైన అంశాలకు సంబంధించిన విద్యను ఇక్కడ సమ్మిళిత విధానం, అంతర్జాతీయ ప్రమాణాలతో బోధిస్తారు.

ఇదీ చదవండి : కరోనా కాలంలోనూ అదరగొట్టిన రైల్వే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.