ETV Bharat / bharat

వ్యక్తిగత వాహనాల్ని ఏ రాష్ట్రానికైనా తీసుకెళ్లొచ్చు - సొంత వాహనాలు

ఇతర రాష్ట్రాలకు ఉద్యోగ బదిలీ అయ్యేవారు తమ సొంత వాహనాలను ఆ రాష్ట్రంలోనేే సులభంగా మళ్లీ రీ రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన ముసాయిదాను బుధవారం విడుదల చేసింది.

re-registration
వ్యక్తిగత వాహనాలు
author img

By

Published : Apr 29, 2021, 6:53 PM IST

ఉద్యోగ బదిలీల పేరిట రాష్ట్రాలు తిరిగే వారు వ్యక్తిగత వాహనాలను తాము కొత్తగా వెళ్లిన రాష్ట్రంలో సులభంగా రీరిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదాను బుధవారం జారీచేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగ బదిలీల మీద రాష్ట్రాలు మారుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ వెంట తీసుకెళ్లే వాహనాలను కేవలం 12 నెలలు మాత్రమే కొత్త రాష్ట్రంలో ఉంచుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. అక్కడే ఉండాలంటే ఆలోపే కొత్త రాష్ట్రంలో రిజిష్టర్ చేసుకోవాలి. అందు కోసం అనుమతిస్తూ మాతృ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలి. కొత్త రాష్ట్రంలో రోడ్డు పన్ను చెల్లించిన తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ ఇస్తారు. ఆ తర్వాత పాత రాష్ట్రంలో రోడ్డు ట్యాక్స్ రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మొత్తం వ్యవహారం చాలా సంక్లిష్టంగా ఉంటోంది. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రహదారి రవాణాశాఖ కొత్త వాహన రిజిస్ట్రేషన్ వ్యవ స్థను తీసుకొస్తోంది.

ఇలా వచ్చిన వాహనాలకు 'ఇన్' సిరీస్ కింద గుర్తిస్తారు. మొదట దీన్ని పైలెట్ విధానంలో అమలు చేస్తారు. తొలుత ఈ సౌకర్యాన్ని అయిదు, అంతకుమించిన రాష్ట్రాల్లో కార్యాలయాలు ఉన్న రక్షణ సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వరంగ సంస్థల ఉద్యోగులకు అనుమతిస్తారు. ఇందులో భాగంగా రెండేళ్ల కాలానికి మోటారు వాహన పన్ను విధిస్తారు. ఆ తర్వాత రెండేళ్లకోసారి పెంచుకుంటూ పోతారు. దీనివల్ల ఉద్యోగులు తమ వాహనాలను ఏ రాష్ట్రాలకైనా సులభంగా తెసుకెళ్లవచ్చు. ఈ ముసాయిదా నిబంధనలపై 30రోజుల్లోపు ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత నోటిఫై చేస్తారు.

ఇదీ చదవండి: వైరల్​: కరోనా సాంగ్​లో పోలీసుల స్టెప్పులు అదుర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.