ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల్లో నక్సల్స్ కట్టడికి కేంద్రం భారీ స్కెచ్​ - naxal news

నక్సల్స్​పై పోరును తీవ్రతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వారికి నిధుల ప్రవాహాన్ని అడ్డుకునేలా చూడాలని అధికారులకు ఆదేశించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఆదివారం.. వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Govt plans to intensify operations against Naxals
ఆ రాష్ట్రాల్లో నక్సల్స్ కట్టడికి కేంద్రం భారీ స్కెచ్​, అమిత్​ షా, కేంద్రం, నక్సల్స్​ అమిత్​ షా
author img

By

Published : Sep 26, 2021, 3:57 PM IST

Updated : Sep 26, 2021, 5:09 PM IST

దేశంలో నక్సల్స్​ను కట్టడి చేసేందుకు.. భద్రతను పెంచడం సహా వారికి అందే నిధులకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే అజెండాగా.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సమాలోచనలు జరిపారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్​ రావు, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్​, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ ఈ భేటీకి హాజరయ్యారు.

బంగాల్​, ఛత్తీస్​గఢ్​, ఆంధ్రప్రదేశ్​, కేరళ రాష్ట్రాల తరఫున అక్కడి ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్​, గిరిరాజ్​ సింగ్​, అర్జున్​ ముండా, నిత్యానంద రాయ్​, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్​ భల్లా, నిఘా విభాగం డైరెక్టర్​ అర్వింద కుమార్​, పౌర​, పోలీస్​ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా..

మావోయిస్టులకు సాయం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం, భద్రతాపరమైన లోపాలను నివారించడం వంటి అంశాలపైనా సీఎంతో చర్చించారు అమిత్​ షా. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం.. తదితర వివరాలను ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకున్నారు.

నక్సల్​ సమస్య తీవ్రంగా ఉన్న జిల్లాల్లోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఏకలవ్య పాఠశాలలు సహా పోస్టాఫీసులు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఇంకా ఏమేం చర్చకు వచ్చాయంటే..

  • నక్సల్స్​కు సంబంధించిన కేసుల విచారణ, దర్యాప్తు
  • రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం
  • రాష్ట్రాల నిఘా విభాగాలు, ప్రత్యేక బలగాల సామర్థ్యం పెంపు
  • పోలీస్​ స్టేషన్లను దుర్బేధ్యంగా నిర్మించడం
  • టెలీకమ్యూనికేషన్​ వ్యవస్థ మెరుగుపరచడం వంటి అంశాలపైనా ముఖ్యమంత్రులతో చర్చించారు అమిత్​ షా.

'ఉనికి తగ్గుతోంది'

ఒడిశాలో మావోయిస్టుల సమస్య.. 3 జిల్లాల్లోనే ఉందని అన్నారు సీఎం నవీన్​ పట్నాయక్​. నక్సల్స్​ ఉనికి లేకుండా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 45 జిల్లాల్లోనే వారి ఉనికి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. మొత్తం 90 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పరిగణిస్తోంది కేంద్రం.

ఇవీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

16 జిల్లాల్లో ఇంటర్నెట్​ బంద్​.. 'పరీక్ష'లో కాపీ కొట్టకూడదని...

Modi in USA: 65 గంటల్లో 20 సమావేశాలు- అమెరికా​లో బిజీబిజీగా మోదీ

Last Updated : Sep 26, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.