ETV Bharat / bharat

రాజకీయ సంక్షోభం వేళ పుదుచ్చేరికి రాహుల్ - farm laws

శాసనసభ ఎన్నికలకు ముందు పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ.. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అక్కడ పర్యటిస్తున్నారు. మత్స్యకారులతో సమావేశమయ్యారు. సాగు చట్టాల విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రభుత్వం నియంత్రించాలని చూస్తోందని ఆరోపించారు.

Govt passed 3 Bills against farmers, the backbone of a nation: rahulGovt passed 3 Bills against farmers, the backbone of a nation: rahul
'చిన్న, మధ్యతరహా పరిశ్రమలే దేశానికి బలం'
author img

By

Published : Feb 17, 2021, 3:15 PM IST

రాజకీయ సంక్షోభం తలెత్తిన పుదుచ్చేరిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ ఏడాది పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పర్యటన సాగుతోంది. పుదుచ్చేరి మత్య్సకారులతో రాహుల్ మాట్లాడారు. వారి సమస్యలు, ప్రభుత్వం వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Govt passed 3 Bills against farmers, the backbone of a nation: rahul
మత్య్సకారులతో రాహుల్​ సమావేశం

ప్రభుత్వం చిన్న, మధ్యతరహా వ్యాపారాలపై దాడి చేయాలని చూస్తోందని మండిపడ్డారు రాహుల్​.

'' చిన్న, మధ్య తరహా వ్యాపారాలను నియంత్రించి.. పెద్ద పెద్ద సంస్థలకే అప్పగించాలని కేంద్రం భావిస్తోంది. మా విధానం వేరు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలే దేశ ఆర్థిక వ్యవస్థకు బలం. మేం వీటిని బలోపేతం చేయాలని అనుకుంటున్నాం.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

సాగు చట్టాల విషయంలో కేంద్రాన్ని మరోమారు విమర్శించారు రాహుల్.

''దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం 3 బిల్లులను తీసుకొచ్చి ఆమోదించింది. మత్స్యకారులతో సమావేశం సందర్భంగా.. రైతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానోనని మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ.. నేను మిమ్మల్ని సముద్రపు రైతులుగా భావిస్తా. భూరైతులకు దిల్లీలో మంత్రిత్వ శాఖ ఉంటే.. మీకు అలాగే ఎందుకు ఉండొద్దు?''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

రాహుల్ గాంధీ పర్యటనకు ముందు ఇద్దరు, అంతకుముందు ఇద్దరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా పుదుచ్చేరి అసెంబ్లీలో అధికార పార్టీ బలం తగ్గింది. అయినప్పటికీ ప్రభుత్వానికి మెజార్టీ ఉందని ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెబుతున్నారు. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని తొలగించి తెలంగాణ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభంతో పాటు అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్‌తో పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలు చర్చలు జరపనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: పుదుచ్చేరి ప్రభుత్వానికి 'రాజీనామా' సెగ

వివాదాలకు తెరా? నయా రాజకీయమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.