ETV Bharat / bharat

'చట్టాల రద్దే లక్ష్యం- ఆందోళనలు ఉద్ధృతం' - ఇండియా లేటెస్ట్​ న్యూస్​

నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణల కోసం కేంద్రం చేసిన ప్రతిపాదనలను.. రైతు సంఘాలు తిరస్కరించాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. అయితే.. రైతులతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, సమస్యలకు పరిష్కారం దిశగా కేంద్రం ఆలోచిస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ పేర్కొన్నారు. మరోవైపు రైతు చట్టాలపై.. విపక్ష పార్టీల కూటమి రాష్ట్రపతిని కలిసింది.

Govt offers written assurance on continuing MSP
ప్రతిపాదనలకు రైతులు నో- ఆందోళనలు ఉద్ధృతం
author img

By

Published : Dec 9, 2020, 6:54 PM IST

వ్యవసాయ చట్టాలపై.. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు స్పష్టం చేశాయి. చట్టాల రద్దు ప్రసక్తే లేదని, సవరణలకు సిద్ధమంటూ కొన్ని ప్రతిపాదనలను కేంద్రం పంపిన నేపథ్యంలో రైతు సంఘాలు తమ వైఖరిని తెలియజేశాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్​ అని పునరుద్ఘాటించాయి.

కేంద్రం ప్రతిపాదనలపై చర్చించి.. మీడియా సమావేశం నిర్వహించారు రైతు సంఘాల ప్రతినిధులు. వ్యవసాయ చట్టాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తున్నట్లు హెచ్చరించారు. తమ తదుపరి కార్యచరణను ప్రకటించారు.

షెడ్యూల్​ ఇదే..

  • డిసెంబర్​ 12 నాటికి దిల్లీ-జైపుర్​, దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారుల దిగ్బంధం
  • 12న అన్ని టోల్​ప్లాజాల వద్ద ఆందోళనలు
  • 12వ తేదీ తర్వాత భాజపా నేతల ఘొరావ్‌ ​
  • 14వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళనలు

14న దిల్లీకి వెళ్లే అన్ని ప్రధాన జాతీయ రహదారులను అడ్డుకోనున్నట్లు రైతు సంఘాల నేతలు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా దిల్లీ ప్రధాన రహదారులను దిగ్బంధిస్తామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా దేశ రాజధానిలో ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

షాతో తోమర్​ భేటీ..

కేంద్రం ప్రతిపాదనలను రైతులు తిరస్కరించిన నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా తో భేటీ అయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఇంకా అయిపోలేదు..!

రైతులతో ప్రభుత్వం చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇదే చివరిసారి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ​

'' ఆరు దఫాలుగా రైతులు ఆందోళన వ్యక్తం చేసిన అంశాలపై కేంద్రం చర్చలు జరిపింది. వారి భయాలను తొలగించాలనే కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతు సమస్యలకు కచ్చితంగా కేంద్రం పరిష్కారం చూపుతుంది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవే చివరిసారి కూడా కావాలని ఆశిస్తున్నా.''

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర మంత్రి

ఇదీ చూడండి: 'సాగు చట్టాలపై విపక్షాల రాజకీయం నిలవదు'

మార్పులు చేసినా..

చట్టాల్లో సవరణలపై కేంద్రం తాజాగా పలు ప్రతిపాదనలను రైతుల ముందు ఉంచింది. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా చట్టాల్లో సవరణ చేస్తామన్న కేంద్రం.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయినా కేంద్రం ప్రతిపాదనలకు రైతులు ఒప్పుకోలేదు.

విపక్షాల భేటీ..

రైతుల ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను విపక్షాలు కలిశాయి. సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చిచెప్పాయి. ఇంతటి చలిలోనూ రైతులు నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్నట్టు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ పేర్కొన్నారు. వారి సమస్యలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: రైతు నిరసనలపై రాష్ట్రపతితో విపక్షాల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.