ఉడాన్ 4.1 పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 392 వాయుమార్గాల్లో బిడ్డింగ్‌ను తెరిచేందుకు పౌర విమానాయాన శాఖ సిద్ధమైంది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ఈ ప్రక్రియను కేంద్రం చేపడుతోంది. ఈ మేరకు ఎన్ఐసీ పోర్టల్‌లో బిడ్డింగ్ పత్రాలను ఉంచిన విమానాయాన శాఖ.. బిడ్లను ఆహ్వానించింది.
ఈ బిడ్డింగ్ ప్రక్రియకు 6 వారాల సమయం పడుతుందని విమానయాన శాఖ తెలిపింది. ఇప్పటి వరకు నాలుగు బిడ్లను కేంద్రం విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు 4.1వ బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా.. చిన్నచిన్న విమానాశ్రయాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, సీప్లేన్ రూట్లను కలపాలని అధికారులు నిర్ణయించారు.