కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు రూపొందించిన కొవిన్(Cowin) పోర్టల్ హ్యాక్‌కు గురైందని పలు మీడియాల్లో వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. అవన్నీ పూర్తి అవాస్తవాలని తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్ వివరాలన్ని డిజిటల్‌గా, భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడదల చేసింది.
అయితే.. ఈ వార్తలపై సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దర్యాప్తు చేపట్టిందని ప్రకటనలో కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చూడండి: COWIN: తెలుగుతో పాటు 10 ప్రాంతీయ భాషల్లో కొవిన్
ఇదీ చూడండి: టీకా ధ్రువపత్రంలో తప్పులా? సరి చేసుకోండిలా..