ETV Bharat / bharat

పరిశ్రమలకు ఆక్సిజన్​ సరఫరాపై కేంద్రం నిషేధం! - పారిశ్రామిక ఆక్సిజన్​ సరఫరాపై కేంద్రం నిషేధం

దేశంలో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. ప్రాణవాయువుకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు అందించే ఆక్సిజన్​పై నిషేధం విధిస్తూ.. దాన్ని ఆస్పత్రులకు మరల్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Oxygen cylinders
ప్రాణవాయువు
author img

By

Published : Apr 18, 2021, 10:59 PM IST

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్​ రోగులకు ప్రాణవాయువు​ సక్రమంగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. పరిశ్రమలకు అందించే ఆక్సిజన్​ సరఫరాపై నిషేధం విధించింది. ఏప్రిల్​ 22 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే.. వీటిలో 9 పరిశ్రమలకు మినహాయింపునిచ్చింది.

కొవిడ్​ కేసులు వేగంగా పెరుగుతుండటం వల్ల.. మెడికల్​ ఆక్సిజన్​కు డిమాండ్​ ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోం శాఖ కార్యదర్శి అజయ్​ భల్లా వెల్లడించారు.

ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, గుజరాత్​, ఉత్తరాది రాష్ట్రాల్లో కొవిడ్ రోగులకు ప్రాణవాయువు​ కొరత తీవ్రంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి నిపుణుల బృందం తెలిపింది. దీంతో పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఆక్సిజన్​ సరఫరా నిలిపివేసి, అవసరమున్న ఆస్పత్రులకు అందించాలని సిఫార్సు చేసింది.

ఇదీ చదవండి: 'ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్'​తో ప్రాణవాయువు కొరతకు చెక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.