ETV Bharat / bharat

టెస్టు లేకుండా డ్రైవింగ్​ లైసెన్స్​.. మార్గదర్శకాలివే.. - టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్

ఆర్​టీఓ కార్యాలయాలతో పనిలేకుండా.. ట్రైనింగ్ సెంటర్ల వద్దే లైసెన్సు పొందేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సవివర మార్గదర్శకాలు విడుదల చేసింది.

driving-licenses
టెస్టు లేకుండానే డ్రైవింగ్ డ్రైవింగ్
author img

By

Published : Aug 4, 2021, 7:58 PM IST

గుర్తింపు పొందిన కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నవారు ఆర్​టీఓ కార్యాలయాల్లో ఎలాంటి టెస్ట్​ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్​ పొందేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ట్రైనింగ్ సెంటర్లతో పాటు.. వాహన తయారీ సంస్థలు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సంబంధిత శిక్షణ పూర్తి చేసిన వ్యక్తులకు ఈ సంస్థలు లైసెన్సులు జారీ చేస్తాయి.

మార్గదర్శకాలు ఇవే

లైసెన్స్ జారీ చేయాలనుకునే సంస్థలకు కేంద్ర మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం నిర్దేశిత భూమి కలిగి ఉండాలి. సంస్థ ఎలాంటి వివాదాల్లో ఉండకూడదు. తాము నడిపిస్తున్న కేంద్రానికి ఆర్థిక సామర్థ్యం ఉందని నిరూపించుకోవాలి. ఇలాంటి సంస్థలు దరఖాస్తు చేసుకుంటే.. 60 రోజుల్లోగా డీటీసీ గుర్తింపు లభిస్తుంది. డీటీసీ గుర్తింపు పొందిన సంస్థలు ప్రతి ఏటా సంబంధిత ఆర్​టీఓ అధికారులకు నివేదిక అందించాలి.

ఈ సంస్థలు సొంతంగా వెబ్​సైట్ అభివృద్ధి చేసుకోవాలి. ట్రైనింగ్ సమయం, ఎన్నిరోజులు పనిచేస్తున్నారనే విషయం, శిక్షణ ఫలితాలు, అందుబాటులో ఉన్న సేవల వివరాలను పొందపరచాలి.

ఇదీ చదవండి: డ్రైవింగ్‌ ట్రాక్‌లో పరీక్షకు వెళ్లకుండానే లైసెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.