మధ్యప్రదేశ్ అశోక్‌నగర్‌లోని చందేరీ తహసీల్ గ్రామానికి చెందిన శివకుమార్.. తాను సజీవంగా ఉన్నానని నిరూపించుకునేందుకు తంటాలు పడుతున్నాడు. తాను ఇంకా చనిపోలేదని చెబుతూ.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.
అసలు విషయమేంటంటే ప్రభుత్వ పత్రాల్లో శివకుమార్ మృతి చెందినట్లు నమోదై ఉంది. అధికారుల పొరపాటు కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత వ్యక్తి తనకు సంబంధించిన ధ్రువపత్రాలను చూపిస్తూ.. సమాచారాన్ని సరిచేయాలని అధికారులను అభ్యర్థిస్తున్నాడు.
"నేను అధికారిక గణాంకాలలో మరణించినట్లు ఉంది. దీనిపై డిప్యూటీ కలెక్టర్‌కు సమాచారం అందించాను. కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు."
-శివకుమార్, బాధితుడు
ఇదీ చదవండి- 50 ఏళ్లలో 117 తుపాన్లు.. 88 శాతం తగ్గిన ప్రాణనష్టం