ETV Bharat / bharat

'కొవిషీల్డ్ తీసుకున్నవారికి ఆ దేశాల్లోకి అనుమతి'

కొవిషీల్డ్ టీకాను 16 ఐరోపా​ దేశాలు అధికారికంగా గుర్తించాయని సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాలా వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని ఆ దేశాల్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపాయన్నారు.

covishield
కొవిషీల్డ్
author img

By

Published : Jul 18, 2021, 7:57 AM IST

పర్యటకులకు శుభవార్త తెలిపారు సీరం ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా. సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొవిషీల్డ్​ను.. 16 ఐరోపా దేశాలు అధికారికంగా గుర్తించాయన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిని తమ దేశంలోకి అనుమతించేందుకు ఆయా దేశాలు అంగీకరించాయన్నారు.

అయితే ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ప్రయాణ నిబంధనలు ఉన్నందున పర్యటకులు జాగ్రత్తగా ఉండాలని పూనావాలా ట్విట్టర్​ ద్వారా సూచించారు.

కొవిషీల్డ్ టీకాను అనుమతించిన దేశాల్లో ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, ఫిన్లాండ్​, జర్మనీ, గ్రీస్, స్పెయిన్.. తదితర దేశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: పిల్లల కోసం సీరం కొత్త టీకా- ఉత్పత్తి షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.