కర్ణాటక మంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 405 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.18.75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
నిందితులను కేరళ కాసర్గోడ్కు చెందిన మొయిద్దీన్ కుంజి(48), మిశ్రీ నసీముల్లా గని(44)లుగా గుర్తించారు. వేర్వురు విమానాల్లో దుబాయ్ నుంచి వచ్చిన వీరిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. ఒకరు పసిడిని నోటిలో దాచి.. మరొకరు షూ పెట్టి తరలిస్తున్నట్లు తేలింది.
ఇదీ చూడండి: అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలో నలుగురు మృతి