బంగారం స్మగ్లింగ్ కేసులో ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులపైనే కేసు నమోదు చేశారు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు. బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలు స్వప్నా సురేశ్‌పై ఒత్తిడి చేసి, సీఎం పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా గతేడాది ఆగస్టు 12, 13 తేదీల్లో ఈడీ అధికారులు వాంగ్మూలం ఇప్పించి, తప్పుడు సాక్ష్యాల సృష్టికి యత్నించారన్నది పోలీసుల ప్రధాన ఆరోపణ. లీక్ అయిన స్వప్న ఆడియోటేప్ అధారంగా ఈ ఫిర్యాదు నమోదు చేశారు.
కేరళ క్రైం బ్రాంచ్ కేసు నమోదు చేయడం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఈడీ వర్గాలు తెలిపాయి.
దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం, భాజపా వాడుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులపై కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: కేరళ రాజకీయాల్లో 'గోల్డ్' చిచ్చు.. ఎవరికి లాభం?