ETV Bharat / bharat

'గోల్డెన్​ బాబా' బంగారు మాస్క్​- ధరెంతంటే..? - గోల్డెన్​ మాస్క్​

ఓ వ్యక్తి రూ.5 లక్షలు ఖర్చు చేసి.. బంగారు మాస్క్ చేయించుకున్నారు. ఆ మాస్కుకు స్వయంగా శానిటైజ్​ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అంతేకాదు మూడేళ్లు పాటు వాడుకునే సౌలభ్యం ఉంది. ఈ మాస్క్​తో కలిపి ఆయన వద్ద రెండు కిలోల బంగారం ఉందట. అందుకే ఆయన్ని 'కాన్పుర్​ గోల్డెన్​ బాబా' పిలుస్తారు.

gold mask
బంగారు మాస్క్
author img

By

Published : Jun 23, 2021, 5:19 PM IST

ఆయనో సాధారణ వ్యక్తి. నిరంతరం ఇద్దరు బాడీగార్డులు కాపలా. ఆ జిల్లాలో ఆయనను 'గోల్డెన్​ బాబా' అని పిలుస్తారు. ఇటీవల ఆ బాబా రూ.5 లక్షలు ఖర్చు చేసి.. ఓ బంగారు మాస్క్​ తయారు చేయించారు. ఆ మాస్కుకు స్వయంగా శానిటైజర్​ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. దీనిని మూడేళ్ల పాటు వాడుకోవచ్చట. దీంతో మళ్లీ వార్తల్లోకెక్కారు.

Gold Mask of Google Golden Baba of Kanpur
బంగారు మాస్క్​

ఆయనే ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​ జిల్లాకు చెందిన మనోజ్​ సెంగల్​. మనోజ్​కు బంగారం అంటే మక్కువ అందుకే ఆయన.. ఎప్పుడూ 250 గ్రాముల బరువైన నాలుగు చైన్లు ధరిస్తారు. శంకం, చేప, హనుమాన్​ లాకెట్ మెడలో నిరంతరం ఉండాల్సిందే. తాజాగా మాస్క్​ కూడా వాటికి తోడైంది. దీనికి 'శివ శరణ్​ మాస్క్​' అనే పేరు పెట్టారు మనోజ్​. దీంతో కలిపి రెండు కేజీల బంగారం ఉన్నట్లు ఆయన తెలిపారు.

మాస్క్​

చెవి పోగులు, మూడు బంగారు బెల్ట్​లు, తుపాకీకి గోల్డెన్​ కవర్​ కూడా ఉన్నాయి. అందుకే 'కాన్పుర్​ గోల్డెన్​ బాబా' అని పిలుస్తారు. దీంతో తనపై దాడులు జరిగే ప్రమాదం ఉందని.. రక్షణగా ఇద్దరు బాడీగార్డులు ఎప్పుడూ వెంటే ఉంటారని మనోజ్​ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే మేనల్లుడి కాల్పులు- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.