బంగాల్ కోల్కతాకు చెందిన నజ్రుల్ పార్క్ ఉన్నాయన్ సమితి దుర్గా పూజ నిర్వాహకులు.. ఈసారి వినూత్నంగా దుర్గాదేవి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. అందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలికలతో దుర్గామాత విగ్రహాన్ని తయారుచేశారు. అంతేకాక దీదీ వస్త్రధారణ దృష్టిలో ఉంచుకుని విగ్రహానికి తెల్లచీర, సాధారణ చెప్పులను తయారుచేస్తున్నారు. విగ్రహం వెనుక 'బిశ్వ బంగ్లా' అనే లోగోను ఏర్పాటు చేయనున్నారు.
ఈ విగ్రహానికి రూ. 2.10లక్షలు ఖర్చు అయిందని క్రౌడ్ఎన్ఎక్స్టీ మీడియా ఆర్ట్ డైరెక్టర్ దీపన్వితా బాగ్చీ తెలిపారు. దీదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతిబింబించేలా 10 చేతులను కూడా విగ్రహానికి అమర్చనున్నట్లు వివరించారు.
బంగాల్లో ప్రతిఒక్కరు మమతా బెనర్జీని దుర్గామాతగా చూస్తారని.. అందుకే దీదీ పోలికలతో కూడిన దుర్గామాత విగ్రహాన్ని రూపొందించామని నజ్రుల్ పార్క్ ఉన్నయాన్ సమితి ఉపాధ్యక్షుడు పార్థ సర్కార్ తెలిపారు.
ఇదీ చదవండి: అండర్వేర్తోనే ఎమ్మెల్యే ట్రైన్ జర్నీ- అదే కారణమట!