ETV Bharat / bharat

GRMB Letter to CWC : 'గోదావరి'పై ఎవరి దారి వారిదే..! - కేంద్ర జల సంఘానికి జీఆర్​ఎంబీ లేఖ

GRMB Letter to Central Water Corporation : గోదావరిలోని నీటి లభ్యత, పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య పీఠముడి రోజురోజుకూ బిగుసుకుంటోంది. జల లభ్యత, పంపకాలపై ఇరు రాష్ట్రాల భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇదే అంశాల వ్యవహారంపై జీఆర్​ఎంబీ కేంద్ర జల సంఘానికి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.

GRMB
GRMB
author img

By

Published : May 7, 2023, 9:27 AM IST

GRMB Letter to Central Water Corporation : తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరిలోని నీటి లభ్యత, పంపకాలపై పీఠముడి రోజురోజుకూ బిగుసుకుంటోంది. 2014లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గోదావరిలో ఎవరికెంత నీటిని కేటాయించవచ్చో సూచిస్తూ.. కేంద్రానికి లేఖ రాసిందని, దాని ప్రకారమే తమ ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయని తెలంగాణ స్పష్టం చేస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం నీటి వాటాలను ట్రైబ్యునల్‌ కేటాయిస్తుందని, లేదంటే పరస్పర అంగీకారంతో ఒప్పందానికి రావాల్సి ఉంటుందని అభ్యంతరం వ్యక్తం తెలుపుతోంది. ప్రాజెక్టుల అనుమతులపై ఈ వివాదాలు ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఇదే విషయమై జీఆర్​ఎంబీ కేంద్ర జల సంఘానికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే : 'నదిలో నీటి లభ్యత కంటే రెండు రాష్ట్రాలు వినియోగంగా పేర్కొంటున్న నీరే ఎక్కువగా ఉంది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ అవార్డులో ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేవు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం గానీ, రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారానికి రావడం గానీ జరగలేదు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి లభ్యత ఎంత, ప్రాజెక్టుల వారీగా వినియోగమెంత అన్నదానిపైనా రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం లేదు' అని గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్​ఎంబీ) లేఖలో పేర్కొంది.

అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ: అయితే.. 'ఆంధ్రప్రదేశ్‌ వినియోగాన్ని 531.9 టీఎంసీలుగా మాత్రమే తీసుకొంటున్నాం. మిగిలిన ప్రాజెక్టులు మొదటిసారిగా ప్రస్తావిస్తున్నందున వాటికి ప్రతిపాదించిన 168.2 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోలేం' అంటూ గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర జలసంఘం లేఖ రాసింది. అంటే పునర్విభజనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను కేంద్ర జలసంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు లెక్క. అదే లేఖలో కేంద్ర జలసంఘం సూచించిన మేరకు సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులకు కలిపి తెలంగాణ ఒకే డీపీఆర్‌ను అందజేసింది. దీనిపై ఏప్రిల్‌ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

'తెలంగాణకు నీటి కేటాయింపు 967.94 టీఎంసీలుగా డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర జలసంఘం రాసిన లేఖలో పేర్కొంది. అయితే ఈ కేటాయింపును మేం ఎక్కడా ఆమోదించలేదు. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పాం. రెండు రాష్ట్రాల మధ్య ట్రైబ్యునల్‌ ద్వారా లేదా పరస్పర అంగీకారంతో కేటాయింపులు జరిగే వరకు కొత్త ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోరాదు. సీతారామ వద్ద నీటి లభ్యతపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి' అని కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. ఇదే అంశంపై జీఆర్​ఎంబీ తాజాగా కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది.

లభ్యత కంటే వినియోగం ఎక్కువ: 'గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కింద 1,486.155 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు తెలంగాణ పేర్కొంది. తమ రాష్ట్రంలో వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదించిన ప్రాజెక్టులకు 967 టీఎంసీలు అవసరమంది. మరోవైపు నదిలో 1,360 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ చెబుతోంది. తమ ప్రాజెక్టులకు 776 టీఎంసీలు అవసరమంటోంది. అంటే రెండు రాష్ట్రాలు కలిపి వినియోగం కింద 1,743 టీఎంసీలను చూపుతున్నాయి' అని నదీ యాజమాన్య బోర్డు పేర్కొంది. అందుకే ఈ ఏడాది జనవరి ఒకటిన జరిగిన బోర్డు సమావేశంలో గోదావరి బేసిన్‌లో నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని కోరామంది. తెలంగాణ పంపిన సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుల డీపీఆర్‌ను పరిశీలించి, అభిప్రాయం చెప్పాలన్న జలసంఘం సూచన మేరకు గోదావరి బోర్డు వారం రోజుల క్రితం తన అభిప్రాయాలతో లేఖ రాసింది.

సాగునీటి పునరుత్పత్తిని పరిగణలోకి తీసుకోలేం: గోదావరిలో నీటి లభ్యత 1486.15 టీఎంసీలని, దీని ఆధారంగా తెలంగాణకు ఎంత, ప్రాజెక్టుల వారీగా ఎంత అన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014 జనవరి 2న కేంద్రానికి లేఖ రాసిందని, ఇందుకు సంబంధించి తెలంగాణ ఇచ్చిన వివరాలను జత చేసింది. 2004లో వాప్కోస్‌ ఇచ్చిన నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావిస్తూ పునరుత్పత్తి ద్వారా వచ్చే 70 టీఎంసీలతో కలిపి మొత్తం 1,360 టీఎంసీలని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వివరాలను జతచేసింది. అయితే సాగునీటి పునరుత్పత్తిని పరిగణలోకి తీసుకోలేమని గతంలోనే స్పష్టం చేసినట్లు నదీ యాజమాన్య బోర్డు పేర్కొంది.

సీతారామ వద్ద నీటి లభ్యత చెప్పండి: 75 శాతం నీటి లభ్యత కింద సీతారామ ఎత్తిపోతల వద్ద 347.06 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు 2022 ఆగస్టులో తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌లో పేర్కొనగా, ఖరారు చేసిన నీటి లభ్యత వివరాలు అందజేయాలని కేంద్ర జలసంఘం సూచించింది. పోలవరం వద్ద 561 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు దానికి ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇచ్చినప్పుడు జలసంఘం పేర్కొంది. అయితే సీతారామ ఎత్తిపోతల వల్ల దిగువ ప్రాజెక్టులపైన ప్రభావం ప్రత్యేకించి వానాకాలం తర్వాత నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పాలని తాజాగా జలసంఘానికి రాసిన లేఖలో గోదావరి బోర్డు కోరింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఏప్రిల్‌లో బోర్డుకు రాసిన లేఖలను కూడా జలసంఘానికి పంపింది. సీతారామ ఎత్తిపోతల ద్వారా వినియోగించే నీటిలో పది టీఎంసీలు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని వైరా, పాలేరు ప్రాజెక్టుల కింద ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో ఉన్నందున కృష్ణా నదీ యాజమాన్యబోర్డు అభిప్రాయాన్ని కోరింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.