ETV Bharat / bharat

'డెంగీ' విజృంభణ- మేక పాలకు విపరీత డిమాండ్​! - మేక పాలకు డిమాండ్ మధ్యప్రదేశ్​

డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో మేకపాలకు డిమాండ్​ పెరిగింది. వ్యాపారులు లీటర్​ పాలు రూ.400కు విక్రయిస్తున్నారు. మేక పాలకు, డెంగీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈ స్టోరీ చదివేయండి..

goat  milk
అక్కడ మేక పాలకు వీపరీతమైన డిమాండ్​.
author img

By

Published : Oct 22, 2021, 1:48 PM IST

మధ్యప్రదేశ్​లోని ఛత్తర్​పుర్​ జిల్లాలో ఇటీవల మేక పాలకు డిమాండ్​ అమాంతం పెరిగింది. దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ. 30 నుంచి 40 మధ్య లభించే లీటర్​ పాలు ఇప్పుడు రూ.300 నుంచి 400కి చేరుకున్నాయి. ఈ స్థాయిలో ధరలు పెరగడం వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం..

రాష్ట్రంలో డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అందులోనూ ఛత్తర్​పుర్​ సహా సమీప జిల్లాల్లో వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంది. మేక పాలు తాగితే డెంగీ నయం అవుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలకు డిమాండ్​ పెరిగింది. ఈ నేపథ్యంలో.. పలు చోట్ల మేక పాలు దొరకడం కూడా కష్టమవుతోందని అంటున్నారు స్థానికులు.

ఈ పరిస్థితిపై స్థానిక డాక్టర్లు స్పందించారు. మేక పాలు తాగడం డెంగీ రోగులకు ఉపయోగమే కానీ.. దాని వల్ల జబ్బు నయం కాదని, అది కేవలం అపోహ అని తెలిపారు.

ఇదీ చూడండి : పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ.. బంగారం దొరికినా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.