ETV Bharat / bharat

4 గంటల వ్యవధిలో 26 మంది కొవిడ్‌ రోగులు మృతి - ఆక్సిజన్​ అందక 26 మంది మృతి

గోవాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్​ అందక 4 గంటల వ్యవధిలో 26 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్​ సరఫరాలో జరిగిన జాప్యమే మరణాలకు కారణమని తెలుస్తోంది. మరోవైపు దక్షిణ గోవా జిల్లా ఆస్పత్రిలో మంగళవారం ఆక్సిజన్‌ లీక్‌ కావడం కలకలం సృష్టించింది.

26 patients die in goa, గోవాలో ఆక్సిజన్​ కొరత
గోవాలో ఆక్సిజన్​ కొరత
author img

By

Published : May 12, 2021, 6:59 AM IST

Updated : May 12, 2021, 7:46 AM IST

గోవాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల వ్యవధిలో 26 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌ సరఫరాలో చోటుచేసుకున్న జాప్యమే మరణాలకు కారణమని తెలుస్తోంది. తాజా ఘటనపై స్వయంగా దర్యాప్తు జరిపించాలని హైకోర్టును గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్‌ రాణె కోరారు. గోవా వైద్య కళాశాల ఆసుపత్రి (జీఎంసీహెచ్‌)లో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్య 26 మంది కరోనా బాధితులు మృత్యువాతపడిన సంగతి వాస్తవమని రాణె తెలిపారు. మరణాలకు కారణం మాత్రం స్పష్టంగా తెలియదని చెప్పారు. ఆసుపత్రికి ప్రాణవాయువు సరఫరాలో కొన్ని లోటుపాట్లు ఉన్న సంగతి నిజమేనని ఆయన అంగీకరించారు.

కొవిడ్‌ రోగుల మృతి వార్త తెలియగానే జీఎంసీహెచ్‌ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సందర్శించారు. కరోనా వార్డులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో చోటుచేసుకున్న జాప్యమే తాజా దారుణానికి కారణమయ్యుండొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాణవాయువు, సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. అయితే- లక్షిత ప్రాంతాలకు సిలిండర్లు సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఆక్సిజన్‌ ట్యాంక్‌ లీక్‌

మార్గోవాలోని దక్షిణ గోవా జిల్లా ఆసుపత్రి (ఎస్‌జీడీహెచ్‌)లో మంగళవారం ఆక్సిజన్‌ లీక్‌ కావడం కలకలం సృష్టించింది. ప్రధాన నిల్వ ట్యాంకులో ప్రాణవాయువును నింపుతుండగా స్వల్ప లీకేజీ చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, వైద్య సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దడం వల్ల రోగులకు ప్రాణాపాయం తప్పింది.

నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే గోవాలోకి..

కరోనా నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారినే ఇకపై గోవాలోకి అనుమతించనున్నారు. బొంబాయి హైకోర్టు గోవా ధర్మాసనం ఈ మేరకు మంగళవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రం మినహాయింపులు ఉంటాయని తెలిపింది.

ఇదీ చదవండి : కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి

Last Updated : May 12, 2021, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.