దేశవ్యాప్తంగా ఉన్న బాలల సంరక్షణ కేంద్రాల(సీసీఐ)లోని చిన్నారులు కరోనా బారినపడుతున్నారన్న వార్తల పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది బాలల హక్కుల అత్యున్నత విభాగం ఎన్సీపీసీఆర్. గత నెలరోజుల్లో ఆయా సంరక్షణ కేంద్రాల్లో కరోనా సోకిన పిల్లల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు లేఖ రాశారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ ప్రియాంక కనూంగో.
" కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో బాలల సంరక్షణ కేంద్రాల్లో చిన్నారుల భద్రత ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సీసీఐ కేంద్రాల్లో పిల్లలు కరోనా బారినపడుతున్నారని వార్తా సంస్థల ద్వారా తెలుస్తోంది. గత నెలరోజుల్లో కరోనా సోకిన చిన్నారుల వివరాలు అందించండి. అలాగే.. జువైనల్ హోంలో కరోనా పాజిటివ్‌గా తేలిన పిల్లల వివరాలూ ఇవ్వండి."
- ప్రియాంక కనూంగో, ఎన్సీపీసీఆర్ ఛైర్పర్సన్
సీసీఐ కేంద్రాల్లో కరోనా సోకిన పిల్లల వివరాలను 15 రోజుల్లోగా అందించాలని స్పష్టం చేసింది ఎన్సీపీసీఆర్.
ఇదీ చూడండి: ఈ పరికరంతో 2 నిమిషాల్లోనే కరోనా ఫలితం!