ETV Bharat / bharat

మోదీ మెచ్చిన యువ కళాకారిణి.. భాగ్యశ్రీ - పట్టచిత్ర కళాకారులు

ఒడిశాలోని రూర్కెలాకు చెందిన భాగ్యశ్రీ అనే యువతి లాక్​డౌన్​ సమయంలో తనలోని కళను ఆవిష్కరించుకుంది. సంప్రదాయ పెయింటింగ్​ మీద ఆసక్తి చూపే ఆమె.. ఖాళీ సీసాలు, నున్నటి రాళ్లపై అందమైన చిత్రాలను తీర్చిదిద్దింది. ఆమె ప్రతిభ గురించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్​కీ బాత్​ కార్యక్రమం సందర్భంగా కొనియాడారు.

odisha, traditional painting
మోదీ మెచ్చిన యువ కళాకారిణి.. భాగ్యశ్రీ
author img

By

Published : Feb 18, 2021, 7:13 AM IST

మోదీ మెచ్చిన యువ కళాకారిణి.. భాగ్యశ్రీ

ఇంజినీరింగ్ విద్యార్థి ఆమె. సంప్రదాయ పెయింటింగ్‌ అంటే ఆసక్తితో వాడేసిన ఖాళీసీసాలు, పాడైపోయిన విద్యుత్ బల్బులు, నున్నటి రాళ్లపై రంగులు, బ్రష్‌తో అందమైన చిత్రాలు గీస్తోంది. విష్ణుభగవానుడి అన్ని అవతారాలను ప్రతిబింబించే సుందరమైన చిత్రాలను తీర్చిదిద్దింది భాగ్యశ్రీ.

లాక్‌డౌన్ సమయాన్నంతా పట్టచిత్ర కోసమే కేటాయించింది భాగ్యశ్రీ. అదే ఆమెకు ఇంతటి గుర్తింపు తెచ్చిపెట్టింది. మన్‌కీబాత్‌లో ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆమె పేరును ప్రస్తావించారు. ప్రస్తుత తరానికి భాగ్యశ్రీ ఆదర్శమని కొనియాడారు. ఆ తర్వాత.. పట్టచిత్రకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్న ఈ కళాకారిణి పేరు దేశమంతా మారుమోగిపోయింది.

మాకు చాలా సంతోషంగా, తనను చూస్తే గర్వంగా ఉంది. కష్టపడి చదువుతుంది. చాలా తెలివైంది. ఆ తెలివితేటలే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.

-మధుస్మితాదాస్, భాగ్యశ్రీ వదిన

ఒడిశాలోని రూర్కెలాకు చెందిన భాగ్యశ్రీ..ఎంటెక్ చదివింది. చిన్నప్పటినుంచీ పెయింటింగ్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. పట్టచిత్ర పుట్టినిల్లుగా చెప్పుకునే పూరీ జిల్లాలోని రఘురాజ్‌పూర్‌కు ఓసారి కుటుంబంతో కలిసి వెళ్లింది భాగ్యశ్రీ. అక్కడి పెయింటింగ్స్‌ చూసి, వాటికి ఆకర్షితురాలైంది. ఎలాగైనా పట్టచిత్ర కల నేర్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, జగన్నాథుడినే గురువుగా భావించి, ఆ కళపై పట్టు సాధించింది. కొద్దికాలంలోనే సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఆన్‌లైన్‌ వేదికగా తన కళాఖండాలను విక్రయిస్తోంది.

ఎవరిదగ్గరా పెయింటింగ్ నేర్చుకోలేదు. చిన్నప్పటినుంచీ ఆసక్తి ఉండేది. ఆ అభిరుచి కోసమే కొంత సమయం కేటాయించేదాన్ని. పట్టచిత్ర గురించి తెలిసిన తర్వాత, ఏదో ఒకరోజు ప్రయత్నించాలని అనుకున్నా. లాక్‌డౌన్ కాలంలో కావల్సినంత సమయం దొరకడంతో..పూర్తి శ్రద్ధ పెట్టా. ప్రధాని నరేంద్రమోదీ వద్దకు నా పెయింటింగ్స్‌ చేరిన తర్వాత, మన్‌కీబాత్‌లో ఆయన నన్ను ప్రస్తావించారు. అప్పటినుంచీ వివిధ ప్రాంతాల నుంచి, నాకు ప్రశంసలు అందుతున్నాయి. ఇందుకు మోదీ గారికి నా కృతజ్ఞతలు.

-భాగ్యశ్రీ సాహు, పట్టచిత్ర కళాకారిణి

ఓ బాటిల్‌పై పట్టచిత్ర గీసేందుకు 8 గంటల సమయం తీసుకుంటుంది భాగ్యశ్రీ. పట్టుదల, శ్రద్ధతో ఓ కొత్త అంశంపై పట్టు సాధించేందుకు సమయం కేటాయిస్తే..తప్పకుండా నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చని చెప్తోంది.

పట్టచిత్ర కళ కోసం ప్రత్యేకంగా యాక్రిలిక్ రంగులు వాడతాను నేను. సంప్రదాయ పద్దతుల్లోనైతే సహజ రంగులు వాడతారు. ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండేందుకు పెయింటింగ్స్‌లో వార్నిష్ వాడతాను. ఎండిపోవడానికి కాస్త సమయం పడుతుంది గానీ, ఎప్పటికీ చెదిరిపోవు. చిన్నప్పటి నుంచీ నా అభిరుచికి అనుగుణంగా ఎంతో ప్రోత్సాహం దక్కింది నాకు. చదువులతో పాటు ఇతర విభాగాల్లోనూ ప్రవేశం ప్రతిఒక్కరికీ అవసరం.

-భాగ్యశ్రీ సాహు, పట్టచిత్ర కళాకారిణి

మనకు ఇక ఉపయోగపడవని మనం పడేసే వస్తువులపై, రంగులు, బ్రష్ వినియోగించి, అద్భుతమైన చిత్రాలు రూపొందిస్తున్న ఈ అమ్మాయిని చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ఈమె తయారు చేస్తున్న ఇంత అందమైన కళాఖండాలకు విస్తృత స్థాయి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభ చాటాలి.

-సుమన్ దత్తా, విశ్రాంత పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి

ఒడిశా కళను వెలుగులోకి తెచ్చేందుకు భాగ్యశ్రీ కృషిచేస్తోంది. పట్టచిత్ర కళపై తనకున్న ఆసక్తి, అభిమానమే ఈ కళను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని చెప్తోంది.

ఇదీ చూడండి : ఎలాంటి వ్యాయామ పరికరమైనా.. కేరాఫ్ 'హైటెక్​ రామ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.