ETV Bharat / bharat

బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి.. కాపాడేందుకు 55 గంటలు శ్రమించినా.. - బిహార్​ రోహ్తాస్ న్యూస్

Girl fell into borewell : మధ్యప్రదేశ్​ సీహోర్ జిల్లాలో బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారి అనేక గంటలపాటు మృత్యువుతో పోరాడి ఓడింది. సహాయక బృందాలు ఆమెను బోరుబావి నుంచి గురువారం సాయంత్రం బయటకు తీశాయి. హుటాహుటిన చిన్నారిని అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు అధికారులు. అయితే అప్పటికే బాధితురాలు ప్రాణాలు విడిచింది. మరోవైపు.. బిహార్​.. రోహ్తాస్​లోని వంతెనపై ఉన్న రెండు పిల్లర్ల మద్య ఇరుక్కుని 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

girl fell into borewell
girl fell into borewell
author img

By

Published : Jun 8, 2023, 6:46 PM IST

Updated : Jun 8, 2023, 8:46 PM IST

girl fell into borewell : మధ్యప్రదేశ్​ సీహోర్ జిల్లాలో మంగళవారం 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారి మరణించింది. ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఫ్ బృందాలు, పోలీసులు జేసీబీలతో దాదాపు 55 గంటలపాటు శ్రమించి సహాయక చర్యలు చేపట్టి చిన్నారిని బోరు బావి నుంచి గురువారం సాయంత్రం బయటకు తీశారు. అలాగే రోబోటిక్ బృందం సాయం తీసుకుని అధికారులు చిన్నారిని బోరు బావి నుంచి బయటకు తీశారు. హుటాహుటిన అంబులెన్స్​లో బాలికను సీహోర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.

girl fell into borewell
బోరు బావిలో పడి మరణించిన చిన్నారి

"బోరు బావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారి మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. బాధితురాలి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షలకు తరలించాం. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయానికి చిన్నారిని బోరు బావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం. అయినా ఫలితం లేకపోయింది. బాలిక 135 అడుగుల లోతుకు జారిపోయింది. ఆర్మీ బృందం, ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు ఎంతో కష్టపడి సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. రోబోటిక్ నిపుణుల బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది."
-- పోలీసులు

సీహోర్​ జిల్లా ముగావళి గ్రామానికి చెందిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మంగళవారం బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం నుంచే సహాయక చర్యలు ప్రారంభించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 6 జేసీబీలు, ఇతర యంత్రాలతో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది. తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నించింది. అయినా కుదరలేదు. ఆఖరికి 55 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టినా చిన్నారి ప్రాణాలు దక్కలేదు.

బ్రిడ్జి పిల్లర్​లో ఇరుక్కుని బాలుడు మృతి
బిహార్​.. రోహ్తాస్​లోని ఘోరం జరిగింది. సోన్ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై ఉన్న రెండు పిల్లర్ల మద్య ఇరుక్కుని రంజన్​ కుమార్​ (12) అనే బాలుడు మృతి చెందాడు. దాదాపు 25 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించి.. బాలుడిని బయటకు తీశారు అధికారులు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

girl fell into borewell
వంతెన వద్ద సహాయక చర్యలు

ఇదీ జరిగింది..
రంజన్​ కుమార్ అనే బాలుడు బుధవారం ఉదయం అతడి కుటుంబ సభ్యులు నిద్రలేచేసరికి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రమైనా ఇంటికి​ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రంజన్ కోసం అతడి తల్లిదండ్రులు వెతికారు. ఈ క్రమంలో సోన్ నదిపై నిర్మించిన బ్రిడ్జి దగ్గర ఓ మహిళకు.. రంజన్​ అరుపులు వినిపించాయి.

  • #WATCH | Rohtas, Bihar: A 12-year-old child who got trapped in the foot of the bridge built on a river located in Nasriganj has been rescued by a team of NDRF. pic.twitter.com/ZESc0eiDOA

    — ANI (@ANI) June 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా కుమారుడు రంజన్ కుమార్​.. మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. గత రెండు రోజులుగా అతడు కనిపించలేదు. అతడి కోసం చాలా చోట్ల వెతికాం. బుధవారం మధ్యాహ్నం వంతెన మీదుగా వెళ్తున్న ఓ మహిళ.. రంజన్ పిల్లర్​లో ఇరుక్కున్నాడని సమాచారం ఇచ్చింది."

--మృతుడు రంజన్ కుమార్​ తండ్రి

వెంటనే అధికారులకు సమాచారం అందించారు రంజన్ కుటుంబ సభ్యులు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. దాదాపు 25 గంటల పాటు శ్రమించి రెండు పిల్లర్ల మద్య ఇరుక్కున్న బాలుడిని బయటకు తీశాయి. అయితే.. అతడి ప్రాణాలు కోల్పోయాడు.

Last Updated : Jun 8, 2023, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.