దిల్లీలో అంజలి అనే యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసు దర్యాప్తు జరుగుతుండగానే.. అలాంటిదే మరో కేసు ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. వేగంగా వచ్చిన కారు ఓ విద్యార్థినిని ఢీకొట్టి.. దాదాపు 200 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటన కొత్త సంవత్సరం మొదటి రోజున జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
2023 జనవరి 1న కౌశాంబీ జిల్లాలో దేవ్కర్పుర్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని.. కంప్యూటర్ క్లాసులకు సైకిల్‌పై వెళ్తుండగా ఓ కారు ఆమెను ఢీకొంది. దీంతో బాలిక సైకిల్‌తో పాటుగా కారు టైరు భాగంలో చిక్కుకుంది. అనంతరం కారు డ్రైవర్ టైరులో చిక్కుకున్న బాలికను.. 200 మీటర్లపైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారు కూడా అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో బాలికకు ఓ కాలు, ఓ చేయి విరగగా.. ముఖం, ఛాతీ భాగాల్లో గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కారు అదుపు తప్పడం కారణంగా నిందితుడికీ గాయాలైనట్లు పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.