ETV Bharat / bharat

స్కూల్​కు వెళ్తుండగా బాలికకు గుండెపోటు- పాఠశాల ఎదురుగానే మృతి - గుండెపోటుతో మరణించిన ఏడేళ్ల బాలిక

Girl Died of a Heart Attack While Going to School : కర్ణాటక చిక్కమగళూరులో హృదయ విదారక ఘటన జరిగింది. పాఠశాలకు బయలుదేరిన 12 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది.

Girl Died of a Heart Attack While Going to School

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 10:19 PM IST

Updated : Dec 20, 2023, 10:35 PM IST

Girl Died of a Heart Attack While Going to School : పాఠశాలకు బయలుదేరిన 12 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. స్కూల్ ఎదుటే కుప్పకూలి కన్నుమూసింది. ఈ ఘటన కర్ణాటక చిక్కమగళూరులోని జొగన్నకెరె గ్రామంలో జరిగింది. ఇంత చిన్న వయసులోనే గుండె పోటుతో మరణించడం వల్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదీ జరిగింది
దరదహల్లి గ్రామానికి చెందిన అర్జున్, సుమ దంపతులకు 12 ఏళ్ల బాలిక శ్రీష్టి సంతానం. ఈమె గ్రామంలోనే ఉన్న పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే రోజులాగే స్కూల్​కు బయలుదేరిన బాలిక, ఒక్కసారిగా పాఠశాల ఎదుట కుప్పకూలింది. దీనిని గమనించిన తోటి విద్యార్థినులు, స్థానికులు హుటాహుటిన ఎదురుగా ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్​కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల వెంటనే ముడిగెరే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు. స్థానిక ఆస్పత్రిలో వైద్యులు ఉంటే బాలిక మరణించేది కాదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"జొగన్నకెరే ప్రైమరీ హెల్త్ సెంటర్​కు సంబంధించిన వైద్యులు గత 20 రోజులుగా రావడం లేదు. వారిని సంప్రదిస్తే శిక్షణ కార్యక్రమానికి వెళ్లామని చెప్పారు. ఉన్నతాధికారులు మరో వైద్యుడిని ఇక్కడికి పంపించలేదు. ఒకవేళ ఇక్కడ వైద్యుడు ఉంటే బాలిక బతికి ఉండేది."

--విక్రమ్, గ్రామ పంచాయితీ సభ్యుడు

డ్యాన్​ చేస్తుండగా గుండెపోటు సెకన్లలోనే మృత్యు ఒడిలోకి
అంతకుముందు ఉత్తర్​ప్రదేశ్​లో ఓ పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్​ చేస్తుండగా గుండెపోటు రావడం వల్ల ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తన మేనల్లుడి పెళ్లిలో పాల్గొనడానికి మనోజ్​ అనే వ్యక్తి వారణాసి నుంచి మండీవాడీహ్​ అనే ప్రాంతానికి వచ్చాడు. వరుడి బంధువులు ఊరేగింపులో భాగంగా డప్పు వాయిద్యాలతో డ్యాన్స్​లు వేస్తూ లఖ్​నవూకు బయలుదేరారు. అయితే డ్యాన్స్​ చేస్తున్న సమయంలో మనోజ్​కు గుండెపోటు రాగా​ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బంధువులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. కేవలం 5 సెకండ్లలోనే ఈ విషాదం జరిగిందని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Heart Attack: గుండె పోటుతో విద్యార్థి.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు.. మృతి..

బస్సు నడుపుతుండగా డ్రైవర్​కు గుండెపోటు వాహనాలపైకి దూసుకెళ్లి

Last Updated : Dec 20, 2023, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.