ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి.
అసలేమైంది?
ముండాఖేడా గ్రామానికి చెందిన బాధిత యువతి(20).. నిందితుడి అన్నతో ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. వారి ప్రేమను వ్యతిరేకించిన నిందితుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడని చెప్పారు.
బాధిత యువతితో పాటు ఆమె ప్రేమించిన వ్యక్తిది ఒకే సామాజికవర్గం అని సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ) సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. వారిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయని చెప్పారు. 40 శాతం శరీరం కాలగా... ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో బాధిత యువతి చికిత్స పొందుతోందని చెప్పారు.
ఇదీ చూడండి: వాహనదారులపై పులి దాడి.. ఇద్దరు మృతి
ఇదీ చూడండి: పిడుగుల బీభత్సం-28 మంది మృతి