ETV Bharat / bharat

నాలుగేళ్లు మౌనంగా ఏడ్చింది.. అదే కామాంధుడు చెల్లినీ వేధించేసరికి.. - Teacher Molests Student

Girl breaks 4 year silence: ఆ స్కూల్లో బాలిక తీవ్ర క్షోభను అనుభవించింది. 2018,19లో 9,10 తరగతులు చదివే సమయంలో పీటీ మాస్టర్​ చేతిలో రెండు సార్లు అత్యాచారానికి గురైనా మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు తన చెల్లిని కూడా అదే వ్యక్తి వేధించేసరికి.. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్​ నాగౌర్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

Girl breaks 4 year silence over rape
Girl breaks 4 year silence over rape
author img

By

Published : Mar 15, 2022, 11:08 AM IST

Girl breaks 4 year silence: పాఠశాలలో అనుభవించిన క్షోభతో.. ఓ బాలిక మూణ్నాలుగేళ్లు వెక్కి వెక్కి ఏడ్చింది. పీటీ మాస్టర్​ చేతిలో రెండు సార్లు అత్యాచారానికి గురైన ఆ బాధితురాలు.. తన బాధను ఎవరితో చెప్పుకోకుండా ఇన్నేళ్లు మౌనం దాల్చింది. ఇప్పుడదే కామాంధుడు తన చెల్లినీ వేధించేసరికి ఆక్రోశంతో.. పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించింది. రాజస్థాన్​ నాగౌర్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..

ఎఫ్​ఐఆర్​ ప్రకారం.. బాధితురాలు 2018లో 9వ తరగతి చదువుతున్న సమయంలో.. హరిరామ్​(30) అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఖాళీగా ఉన్న ఓ క్లాస్​రూంలోకి తీసుకెళ్లి ఈ దురాఘతానికి ఒడిగట్టాడు. 10వ తరగతి చదివే సమయంలో మరోసారి అత్యాచారం చేశాడు.

స్కూల్​ మానేసిన బాలిక.. అప్పటి నుంచి భయం, బాధతో మానసిక క్షోభను అనుభవిస్తూ ఇంట్లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

Teacher Molests Student: మార్చి 5న అదే ఉపాధ్యాయుడు.. బాధితురాలి సోదరిని లైంగికంగా వేధించాడు. కోపంతో రగిలిపోయిన ఆ బాలిక గతంలో తనకు జరిగిన విషయాన్ని.. తల్లిదండ్రులతో చెప్పింది. తన అంకుల్​తో కలిసి నాగౌర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇద్దరు బాధితురాళ్ల వాంగ్మూలాలు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: గర్భం దాల్చిందని పెళ్లి.. అది వద్దన్నందుకు భార్యపై హత్యాయత్నం!

ప్రేయసితో పదో తరగతి విద్యార్థి పరార్.. ఊరంతా టెన్షన్​ టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.