Ghaziabad family cheating: ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన ఓ కుటుంబం.. నకిలీ కంపెనీలు, పత్రాలు సృష్టించి రూ.100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడింది. తప్పుడు ధ్రువపత్రాలతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తూ అనేక మందికి టోకరా వేసింది. నకిలీ ఆధార్ కార్డులను సైతం నిందితులు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్ పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకొని అరెస్టు చేశారు.
UP crime news
పోలీసుల కథనం ప్రకారం.. గాజియాబాద్‌లోని నంద్‌గ్రామ్‌కు చెందిన ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ జైన్.. తన భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తెతో కలిసి ఈ మోసాలు చేశాడు. వీరికి మరో ఇద్దరు బంధువులు సైతం తోడయ్యారు. తప్పుడు పత్రాలను తయారు చేసి.. ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లను ఒకటికంటే ఎక్కువసార్లు విక్రయించారు. తక్కువ ధరకే వీటిని అమ్మేయడం వల్ల.. అనేక మంది వీరి వలలో చిక్కారు. వీరిపై 29కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వీరి అరెస్టుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు పోలీసులు. అయితే, ఎప్పటికప్పుడు వారి గుర్తింపును మార్చుకుంటూ తప్పించుకు తిరిగారు ఈ కేటుగాళ్లు.
UP Ghaziabad 100 crore cheating
దిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల్లో వీరు నివసించారని పోలీసులు తెలిపారు. ఐడియా బిల్డర్స్, మంజు హోమ్స్, రెడ్ యాపిల్ వంటి పేర్లతో డజన్‌కు పైగా నకిలీ కంపెనీలను సృష్టించారని చెప్పారు.
తప్పుడు ధ్రువపత్రాలతో ఆధార్ కార్డులు సంపాదించి తమ గుర్తింపును ఎప్పటికప్పుడు మార్చుకున్నారని దర్యాప్తులో తేల్చారు. ఈ నకిలీ ఆధార్ కార్డులతో దుబాయ్ సిటిజెన్షిప్ కార్డును సైతం సంపాదించారని వెల్లడించారు. ఈ క్రమంలో దుబాయ్‌కు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేసి.. 4 ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్ ఫోన్లు, 13 నకిలీ ఆధార్ కార్డులు, 4 నకిలీ పాన్ కార్డులు, చెక్ బుక్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ రెసిడెన్సీ కార్డును సైతం వీరి వద్ద ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 200 మంది మహిళలు.. 4000 నగ్నఫొటోలు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ గలీజ్ దందా!