ETV Bharat / bharat

ఎరువుల ఫ్యాక్టరీ నుంచి గ్యాస్​ లీక్​- 30మందికి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు - Chennai Gas Leak Incident Ministers Reaction

Gas Leak Chennai : తమిళనాడు చెన్నై ఎన్నూర్‌లోని ఓ ఎరువుల తయారీ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. దీంతో అక్కడే నివాసముంటున్న కొందరు స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Ammonia Gas Leak In Chennai Fertiliser Unit
Gas Leak Chennai Latest News
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 10:50 AM IST

Updated : Dec 27, 2023, 12:23 PM IST

Gas Leak Chennai : తమిళనాడు చెన్నైలోని ఎన్నూర్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఓ ఎరువుల తయారీ యూనిట్‌ నుంచి అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ కావడం వల్ల పలువురు ఆస్పత్రి పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే అత్యవసర బృందాలు రంగలోకి దిగాయి. సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తర చెన్నైలోని చిన్న కుప్పం, పెరియా కుప్పం, నేతాజీ నగర్​, బర్మా నగర్​ ప్రాంతాల్లో గ్యాస్​ లీక్​ అయినట్లు అధికారులు తెలిపారు.

  • Coromdandel International Limited Industry to be shut till further orders: Meyyanathan Siva V, Minister of Environment and Climate Change of Tamil Nadu https://t.co/KLi18RAGUm

    — ANI (@ANI) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గ్యాస్ లీకైన సమయంలో యూనిట్ సమీపంలో ఉన్న 30 మంది ప్రజలు అసౌకర్యానికి లోనయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. కొందరు కళ్లు తిరిగి పడిపోయారని తెలుస్తోంది. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమచారం. మరోవైపు ఎరువుల యూనిట్ సిబ్బంది సాంకేతిక సమస్యను సరిదిద్దుడానికి చర్యలు తీసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

'కొందరికైతే మూర్ఛ కూడా వచ్చింది'
'గ్యాస్ లీకేజీ గురించి తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఇళ్లలో పడుకున్న వారంతా ఒక్కసారిగ రోడ్లపైకి పరుగులు తీశారు. మంగళవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఎరువుల తయారీ యూనిట్​ నుంచి ఒక రకమైన దుర్వాసన చుట్టుపక్కల అంతటా వ్యాపించింది. ఇది వెంటనే అక్కడే ఉన్న నివాస పరిసరాల్లోకి పాకింది. దీంతో 25 మందికిపైగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వాసన కారణంగా కొందరికైతే మూర్ఛ కూడా వచ్చింది. వీరందరినీ సమీప ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది' అని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఒక అధికారి తెలిపారు.

  • #WATCH | Tiruvallur, Tamil Nadu: People hold protest after Ammonia gas leak was detected in a sub-sea pipe in Ennore.

    According to DIG, Joint Commissioner Avadi, Vijayakumar, there are no more gas (ammonia) leaks at Ennore. People are back home. Medical and police teams are… pic.twitter.com/APYymkgY6X

బాధిత సంస్థపై కొరడా
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తమిళనాడు వైద్యారోగ్య శాఖ మంత్రి ఎంఏ సుబ్రహ్మణ్యన్​ పరామర్శించారు. వారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్యాస్​ లీక్​ ఘటనకు కారణమైన కోరోమాండల్​ ఇంటర్నేషనల్​ లిమిటెడ్​ ఇండస్ట్రీని మూసివేయాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు తెరవకూడదని పర్యావరణ శాఖ మంత్రి మెయ్యనాథన్​ శివ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై స్థానికులు నిరసనలకు దిగారు. గ్యాస్​ లీకైన ప్రాంతమంతా ప్రస్తుతం అదుపులోకి వచ్చిందని, ప్రజలందరూ తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

  • VIDEO | Tamil Nadu Health Minister Ma. Subramanian meets those hospitalised after the ammonia gas leak at a chemical factory in Ennore. pic.twitter.com/ROonzUpofQ

    — Press Trust of India (@PTI_News) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవాళ్టి నుంచి శబరిమల ఆలయం మూసివేస్తున్నారు! కారణం తెలుసా?

రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం- అయ్యప్పను దర్శించుకున్న 32 లక్షల మంది భక్తులు

Last Updated : Dec 27, 2023, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.