ETV Bharat / bharat

Gas Cylinder Blast Hyderabad : గ్యాస్​ సిలిండర్​ పేలి ఏడుగురికి తీవ్ర గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం - హైదరాబాద్​ దోమలగూడలో అగ్నిప్రమాదం

Cylinder Blast at Domalguda Hyderabad : బోనాల పండుగ నేపథ్యంలో ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తుండగా.. ఒక్కసారిగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు మరో ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Gas Cylinder Blast at Domalguda
Gas Cylinder Blast at Domalguda
author img

By

Published : Jul 11, 2023, 2:03 PM IST

Updated : Jul 11, 2023, 3:45 PM IST

7 Injured in Gas Cylinder Blast at Domalguda : బోనాల పండుగ సందర్భంగా ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించడంతో కుటుంబంలోని ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బోనాల పండుగ నేపథ్యంలో దోమలగూడ ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి ఇంటికి ఆమె కుమార్తె ధనలక్ష్మి, ఆమె పిల్లలు అభినవ్‌, శరణ్య, విహార్‌, నాగలక్ష్మి సోదరి నాగులు, ఆమె భర్త ఆనంద్‌ వచ్చారు. వీరంతా కలిసి పిండి వంటలు తయారు చేస్తున్న క్రమంలో రెగ్యులేటర్‌ నుంచి గ్యాస్‌ లీకై ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో వారందరికీ మంటలు అంటుకున్నాయి. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు వారి ఇంటి వద్దకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించడంతో ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. బాధితులంతా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు, గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సిలిండర్‌కు రెగ్యులేటర్‌ సరిగ్గా అమర్చకపోవడం వల్ల గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

ఉదయం మాకు ఓ ఫోన్‌ వచ్చింది. దోమలగూడలో గ్యాస్‌ సిలిండర్‌ పేలిందని సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాం. ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సిలిండర్‌కు రెగ్యులేటర్‌ సరిగ్గా అమర్చకపోవడం వల్లే గ్యాస్‌ లీకై ప్రమాదం జరిగింది. ఘటనలో సిలిండర్‌ పేలలేదు. - ప్రసాద్‌, అగ్నిమాపక శాఖ ఏడీఎఫ్‌వో

ఇంట్లో నాగలక్ష్మి ఒంటరిగా నివాసం ఉంటోంది. బోనాల పండుగ నేపథ్యంలో ఆమె కుమార్తె ధనలక్ష్మి తన ముగ్గురు పిల్లలు అభినవ్‌, శరణ్య, విహార్‌లను తీసుకుని ఇక్కడికి వచ్చింది. నాగలక్ష్మి చెల్లెలు నాగులు, ఆమె భర్త సైతం వచ్చారు. ఉదయం అందరూ కలిసి పిండి వంటలు చేస్తుండగా.. ఒక్కసారిగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. చిన్న గది కావడంతో వారు బయటకు రాలేకపోయారు. అప్పటికే కాలనీవాసులమంతా చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాం. అంతలోనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చి మంటలను అదుపు చేశారు. ఘటనలో ఏడుగురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. -స్థానికుడు

ఇవీ చూడండి..

Balanagar Fire Accident : బాలానగర్​లో అర్థరాత్రి కలకలం.. అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

బార్బెక్యూ రెస్టారెంట్​లో గ్యాస్ పేలుడు!.. 31 మంది దుర్మరణం

Last Updated : Jul 11, 2023, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.