ETV Bharat / bharat

వెల్లుల్లి మాత్రలకు పెరుగుతున్న గిరాకీ

రాజస్థాన్​లోని కోటాలో కొందరు మహిళలు వెల్లుల్లితో క్యాప్సుల్స్​ తయారుచేస్తున్నారు. దీనికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిమాండ్​ పెరిగింది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి ద్వారా కీళ్ల నొప్పులు, బ్లడ్​ కొలెస్ట్రాల్​ వంటి జబ్బులను నివారించవచ్చని కృషి విజ్ఞాన్​ కేంద్రంలో సేవలు అందించే డాక్టర్​ మమతా తివారీ తెలిపారు.

garlic capsules, rajasthan
గార్లిక్​ క్యాప్సూల్స్​కు పెరుగుతున్న ఆదరణ
author img

By

Published : Feb 7, 2021, 6:16 AM IST

Updated : Feb 7, 2021, 6:28 AM IST

గార్లిక్​ క్యాప్సూల్స్​కు పెరుగుతున్న ఆదరణ

రాజస్థాన్​లోని కోటాకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం మహిళా సిబ్బంది వెల్లుల్లితో ఔషధాలను రూపొందిస్తున్నారు. డాక్టర్​ మమతా తివారీ ఆధ్వర్యంలో ఎన్నో ఔషధ గుణాలు గల ఈ వెల్లుల్లితో క్యాప్సుల్స్​ను రూపొందించారు. 500, 1000 మిల్లీగ్రాములుగా ఆన్​లైన్​లో లభించే వీటికి ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్​ పెరిగింది.

garlic capsules, rajasthan
గార్లిక్​ క్యాప్సూల్స్​కు పెరుగుతున్న ఆదరణ

"వెల్లుల్లితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ బాక్టీరియల్​ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాదు, గార్లిక్​తో బ్లడ్​ కొలెస్ట్రాల్​, కీళ్లనొప్పులు, క్యాన్సర్ వంటి సమస్యలను నివారించవచ్చు."

--డాక్టర్​ మమతా తివారీ, కృషి విజ్ఞాన్​ కేంద్రం

ఎండపెట్టిన వెల్లుల్లి​ని వలిచి వాటిని పొడిచేస్తామని సిబ్బంది తెలిపారు. కేజీ వెల్లుల్లితో 100 గ్రాముల పౌడర్​ తయారు అవుతోందని, ఈ క్యాప్సుల్స్​ను తయారు చేయడానికి 10 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. వెల్లుల్లి వాసనకు విరుగుడుగా అందులో జంతు పదార్థాల నుంచి సేకరించే ప్రొటీన్ (యానిమల్​ జెలాటిన్​) , బియ్యం పొట్టును ఉపయోగిస్తున్నారు. వీటి ధర రూ.1 నుంచి 3 రూపాయల మధ్య ఉంటుంది. బియ్యం పొట్టుతో తయారుచేసిన క్యాప్సుల్స్​ ధర ఎక్కువ. ఈ గార్లిక్ క్యాప్సుల్స్​ ​ ధరలకు మార్కెట్​లో వెల్లుల్లి ధరను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయని సిబ్బంది తెలిపారు. ​

ఇదీ చదవండి : 'ఆ భూముల క్రమబద్ధీకరణను హక్కుగా పొందలేరు'

Last Updated : Feb 7, 2021, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.