ఛత్తీస్‌గఢ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌నందగావ్ జిల్లా డోంగార్గావ్ ప్రాంతంలో కరోనాతో మృతి చెందిన నలుగురి మృతదేహాలను చెత్త తరలించే వాహనాల్లో శ్మశానవాటికకు తీసుకెళ్లటం కలచివేస్తోంది.
అయితే.. ఆక్సిజన్ అందకపోవడం వల్లే కొవిడ్ బాధితులు చనిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మృతుల్లో.. ముగ్గురు రోగులు కొవిడ్ కేర్ సెంటర్‌లో, మరొకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ తొలగించిన వార్డ్ బాయ్- కొవిడ్ రోగి మృతి!
మరోవైపు.. ఆక్సిజన్ అందక చనిపోయారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. ప్రతి కొవిడ్ సంరక్షణ కేంద్రంలో.. 10-15 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మృతదేహాలను చెత్త వాహనాల్లో శ్మశానవాటికకు తరలించటం కలచి వేస్తోందన్నారు. అయితే.. అది తమ పని కాదని.. నగర పంచాయతీ పరిధిలోని అంశంగా వైద్యాధికారి చెప్పారు.
ఇదీ చదవండి: ఇలాగే కొనసాగితే.. రోజుకు 3 లక్షల కేసులు!