ETV Bharat / bharat

ఒకప్పటి కార్పెంటర్​.. ఇప్పుడు ఎమ్మెల్యే- పంక్చర్ మెకానిక్​గా కుమారుడు

Fakir Ram Tamta: ఎమ్మెల్యే అంటే మంచి వేతనం.. ప్రభుత్వ సదుపాయాలు.. విలాసవంతమైన జీవితం.. ఇదే అనుకుంటారంతా. కానీ.. ఈయనలో ఇంకో కోణం ఉంది. ప్రజాప్రతినిధిగా గెలిచినా.. సాదాసీదా జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారులు ఇద్దరూ తండ్రి బాటలోనే కార్పెంటర్​, పంక్చర్​ పనులు చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

GANGOLIHAT MLA FAKIR RAM TAMTA
GANGOLIHAT MLA FAKIR RAM TAMTA
author img

By

Published : Mar 17, 2022, 4:38 PM IST

Updated : Mar 17, 2022, 6:36 PM IST

Fakir Ram Tamta
: సాధారణంగా తండ్రి ఎమ్మెల్యే అయితే ఆయన కుమారులేం చేస్తారు? దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కానీ.. ఈ ప్రజాప్రతినిధి కుమారులు మాత్రం అందుకు భిన్నం. చిన్న చిన్న పనులు చేసుకుంటూ సాదాసీదా జీవనం సాగిస్తున్నారు.

ఫకీర్​ రామ్​ టమ్టా.. ఇటీవలి ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. పితోరాగఢ్​ జిల్లా గంగోలీహాట్​ స్థానం నుంచి భాజపా తరఫున పోటీచేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన ఒకప్పుడు కార్పెంటర్​ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. కానీ రాజకీయాలు ఈయన జీవితాన్ని మార్చేశాయి. అభ్యర్థిగా ఎంపికవడం, గెలుపొందటం చకాచకా జరిగిపోయాయి. అయినా ఆ ప్రభావం తన కుమారులపై పడలేదు.

ఫకీర్​ రామ్​కు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు జగ్​దీష్​ టమ్టా.. పన్నెండేళ్లుగా హల్ద్వానీలో నివసిస్తున్నాడు. దమువాదుంగ వద్ద రోడ్డుపక్కన పంక్చర్ల షాపు నిర్వహిస్తున్నాడు.

GANGOLIHAT MLA FAKIR RAM TAMTA
పంక్చర్లు అతుకుతున్న ఎమ్మెల్యే కుమారుడు

చిన్న కుమారుడు వీరేంద్ర రామ్​.. తండ్రి బాటలోనే కార్పెంటర్​ పనిచేస్తున్నాడు.

ఇద్దరు కుమారులు ఇష్టంతోనే ఈ పని చేస్తున్నట్లు చెప్పడం విశేషం. ఇప్పటికీ తాము పని చేస్తేనే.. ఇల్లు గడుస్తుందని, ఇలా ఉండటమే తమకు ఇష్టమని వారు చెబుతున్నారు.

ఇవీ చూడండి: రోడ్డుపై ఎద్దులు హల్​చల్​- బుల్​ఫైట్ వీడియో వైరల్

హిజాబ్​ వివాదం.. కర్ణాటకలో బంద్​.. దుకాణాల మూసివేత

Last Updated : Mar 17, 2022, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.