Gandhi Death Anniversary: మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు.
జాతిపిత, మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్రమోదీ. మహాత్ముడి గొప్ప ఆలోచనలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు సమష్టిగా ప్రయత్నించాలన్నారు.
"బాపూ వర్ధంతిని గుర్తుచేసుకుంటున్నాం. మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలి. ఈరోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీరులకు నివాళులు. వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతిసారీ గుర్తుచేసుకుంటాం."
-- ప్రధాని నరేంద్రమోదీ
రాహుల్ నివాళులు..
జాతిపిత మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నిజం ఎక్కడ ఉంటుందో అక్కడ బాపూ ఉంటారని అన్నారు.
"ఓ హిందుత్వవాది గాంధీని చంపాడు. హిందుత్వవాదులంతా గాంధీజీ లేరని అనుకుంటారు. కానీ ఎక్కడైతే నిజం ఉంటుందో అక్కడ గాంధీ ఉంటారు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
షా నివాళులు..
గాంధీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌లో గాంధీపెయింటింగ్ను ఆవిష్కరించారు.
" మహాత్మాగాంధీ స్వదేశీ, స్వభాషా, స్వరాజ్ స్ఫూర్తిని ప్రజల్లో నింపారు. మహాత్ముడి ఆలోచనలు, ఆశయాలు ఎల్లప్పుడూ ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపుతాయి."
-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: మహాత్ముడి వర్ధంతి: సత్యాగ్రహ నినాదం- నిశ్శబ్ద పోరాటం