Gajwel Telangana Assembly Election Result 2023 Live : తెలంగాణ శాసససభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 30 రోజులు 95 నియోజకవర్గాలను చుట్టుముట్టారు. కానీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం తీర్పును వెలువరిస్తే, గజ్వేల్ ప్రజలు మాత్రం కేసీఆర్‌నే కావాలని తీర్పును వెలువరించారు.
ఇప్పటివరకు పూర్తిగా 14 టేబుల్స్‌లో 23 రౌండ్లు జరగగా, వీటితో పాటు పోస్టల్ ఓట్లు కలిపి కేసీఆర్‌కు 45,031 ఓట్ల మెజారిటీ లభించింది. మొదటి రౌండ్ నుంచి పూర్తి ఆధిక్యతను కనబరిచిన బీఆర్ఎస్ అధినేత, చివరి 23వ రౌండ్ వరకు కూడా అదే ఊపును కొనసాగించారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు మొత్తం 1,11,684 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సారెడ్డికి 32,568 ఓట్లు వచ్చాయి. కేసీఆర్‌కు గట్టి పోటీ ఇస్తారని భావించిన ఈటల రాజేందర్ 66,653 ఓట్లు లభించాయి. ఈటలకు హుజురాబాద్‌లో కూడా ఓటమి తప్పలేదు.
KCR Loss in Kamareddy Constituency : తెలంగాణ ప్రజానికం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకించిన ఎన్నిక ఏదైనా ఉందంటే అది కామారెడ్డినే. ఈ ఎన్నికలో కేసీఆర్ రెండో స్థానానికే పరిమితం అయ్యారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ స్థానంలో బరిలో నిలవడమే ఇందుకు గల ప్రధాన కారణం. కానీ ప్రజలు మాత్రం బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల మెజారిటీతో గెలుపొంది అందరినీ ఆకర్షించారు. ఈయన గెలుపుగల ప్రధాన కారణం స్థానికుడు కావడమే. రేవంత్‌రెడ్డి మూడోస్థానానికే పరిమితం అయ్యారు.
Telangana Assembly Election Results 2023 : తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖరారు కాగానే కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం తన వ్యక్తిగత వాహనాల్లో ప్రగతిభవన్ వీడి ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన చెందిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమైన రోజు నుంచి రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 2018లో శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికకు వెళ్లి రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మళ్లీ మూడోసారి సీఎంగా గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. కానీ 2023లో ఓటమిపాలై వెనుదిరిగారు. తొమ్మిదిన్నరేళ్లు పాటు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు.