ETV Bharat / bharat

G20 Declaration India : భారత్​కు మరో సక్సెస్​.. జీ20 డిక్లరేషన్​పై ఏకాభిప్రాయం - జీ20 సదస్సు 2023 ఫ్రాన్స్​

G20 Declaration India : భారత్​ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. శిఖరాగ్ర సమావేశాల ముగింపు సందర్భంగా విడుదల చేసే సంయుక్త డిక్లరేషన్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించింది. సంయుక్త డిక్లరేషన్‌పై జీ20 దేశాల ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రధాని మోదీ అధికారికంగా ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 3:49 PM IST

Updated : Sep 9, 2023, 4:09 PM IST

G20 Declaration India : దిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా భారత్​ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. శిఖరాగ్ర సమావేశాల ముగింపు సందర్భంగా విడుదల చేసే సంయుక్త డిక్లరేషన్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించింది. సంయుక్త డిక్లరేషన్‌పై జీ20 దేశాల ఏకాభిప్రాయం కుదిరినట్లు సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు. డిక్లరేషన్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

  • #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9

    — ANI (@ANI) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే దిల్లీ జీ20 సమావేశాల సంయుక్త డిక్లరేషన్‌.. దృఢమైన, స్థిరమైన, సమతుల్యమైన వృద్ధి కోసం కృషి చేస్తుందని భారత జీ20 షెర్పా అమితాబ్​ కాంత్​ ట్వీట్​ చేశారు. 21వ శతాబ్దానికి చెందిన బహుపాక్షిక సంస్థల పురోగతిని వేగవంతం చేయడంపై దృష్టి పెడుతుందని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధితోపాటు భౌగోళిక- రాజకీయ సమస్యలపై 100% ఏకాభిప్రాయంతో కూడిన సంయుక్త డిక్లరేషన్​ ఇది అని తెలిపారు.

  • The #NewDelhiLeadersDeclaration focuses on -

    ▶️Strong, Sustainable, Balanced, and Inclusive Growth
    ▶️Accelerating Progress on #SDGs
    ▶️Green Development Pact for a Sustainable Future
    ▶️Multilateral Institutions for the 21st Century
    ▶️Reinvigorating Multilateralism#G20India

    — Amitabh Kant (@amitabhk87) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉక్రెయిన్​ పేరాగ్రాఫ్​ మార్పుతో..
శనివారం ఉదయం.. సంయుక్త డిక్లరేషన్‌లో ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ సవరించిన పేరాగ్రాఫ్‌ను జీ20దేశాల ప్రతినిధులకు పంపిణీ చేసినట్లు దౌత్యవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పేరాగ్రాఫ్‌పై ఏకాభిప్రాయం రాకపోవటంవల్ల సానుకూల ఫలితం రాబట్టేందుకు భౌగోళిక రాజకీయ అంశానికి చెందిన పేరా లేకుండా ముసాయిదా శిఖరాగ్ర ప్రకటనను పంపిణీ చేసినట్లు చెప్పాయి. దీంతో కొత్త పేరాగ్రాఫ్‌తో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని భారత్​ ఆశించినట్లే జరిగింది.

మార్నింగ్​ సెషన్​ వీడియోను ట్వీట్​ చేసిన మోదీ
G20 Modi Video : దిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు తొలిరోజు మార్నింగ్​ సెషన్​ విశేషాలను ప్రధాని మోదీ సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. దిల్లీ జీ20 సదస్సులో ఫలప్రదమైన ఉదయం అంటూ వీడియో ట్వీట్​ చేశారు.

శనివారం ఉదయం దిల్లీకి పలువులు దేశాధినేతలు
G20 Leaders Arrival : రెండు రోజులపాటు జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మెక్రాన్​, జర్మనీ ఛాన్స్​లర్​ ఓలాఫ్​ స్కోల్జ్​, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​ టెడ్రోస్​ అధనామ్​.. శనివారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు.

ఫ్రాన్స్​ అధ్యక్షుడు మెక్రాన్​కు ఘన స్వాగతం
France President India Visit : దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఫ్రాన్స్​ అధ్యక్షుడు మెక్రాన్​కు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ సహా పలువురు అధికారులు స్వాగతం పలికారు. అక్కడే ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనను ఆయన తిలకించారు. అక్కడి నుంచి నేరుగా జీ20 సదస్సు వేదికైన భారత మండపానికి చేరుకున్నారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంప్రదాయ స్వాగతం పలికారు.

స్వయంగా ఆహ్వానం పలికిన మోదీ
G20 Summit First Meeting : శనివారం ఉదయం భారతమండపంలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్​, బ్రెజిల్​ అధ్యక్షుడు లూయిజ్​ ఇనాసియే లులూ సహా అనేక మంది దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ దేశాల అధినేతలకు వేదిక వద్ద ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలికారు. వారికి స్వాగతం పలికే ప్రదేశంలో బ్యాక్​గ్రౌండ్‌లో కోణార్క్‌ చక్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

2024లో బ్రెజిల్​ అధ్యక్షతన జీ20
2024 G20 Presidency : అదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడిని స్వాగతిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే జోహన్నెస్‌బర్గ్‌లో ఆయనను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. "జీ20 సదస్సులో బ్రెజిల్​ అధ్యక్షుడిని మళ్లీ కలిసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. వివిధ విషయాలపై ఆయన అభిప్రాయాలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని మోదీ ట్వీట్​ చేశారు. జీ20 తదుపరి అధ్యక్షతను బ్రెజిల్​ చేపట్టనుంది.

G20 Summit Modi Speech : 'సబ్​కా సాథ్..​ స్ఫూర్తితో ముందుకెళ్లాలి'.. జీ20 సదస్సులో మోదీ.. ఆఫ్రికాకు శాశ్వత సభ్యత్వం

Bharat Name Controversy : 'భారత్' నేమ్​బోర్డ్​తో జీ20కి మోదీ.. విపక్షాలు ఫైర్​.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్​

Last Updated : Sep 9, 2023, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.