సాగు చట్టాలపై(Farm Laws) కేంద్రంతో చర్చించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్(Rakesh Tikait). వ్యవసాయ చట్టాల సమస్యపై ఐరాసను సంప్రదిస్తామని తాము చెప్పలేదన్నారు. జనవరి 26న జరిగిన ఘటనపై దర్యాప్తునకు సంబంధించి మాట్లాడుతూ.. 'దేశంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టే సంస్థ ఏదైనా ఉందా.. లేక విషయాన్ని ఐరాస దృష్టికి తీసుకువెళ్లాలా?' అని పేర్కొన్నామని స్పష్టం చేశారు.
ఈనెల 22 నుంచి పార్లమెంట్ వద్ద 200 మంది రైతులతో నిరసనలు(Farmers protest) చేపడతామని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సాగు చట్టాలపై నిరసన తెలుపుతామని ఇదివరకే రైతు సంఘాలు ప్రకటించాయి. సమావేశాలు ముగిసేవరకు ప్రతిరోజు నిరసన తెలపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నాయి.
ఇదీ చూడండి : Live video: అదుపు తప్పి లోయలో పడ్డ ట్రక్కు