ETV Bharat / bharat

పాత్రికేయుడి అరెస్టు- భగ్గుమన్న విపక్షాలు, జర్నలిస్ట్​ సంఘాలు - కాంగ్రెస్​

దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద పోలీసులు.. ఆదివారం ఓ పాత్రికేయుడిని అరెస్టు చేశారు. బారికేడ్లను తొలగించడానికి ప్రయత్నం చేశాడని తెలిపారు. అయితే.. దీనిపై విపక్షాలు సహా పాత్రికేయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. మీడియాను అణగదొక్కుతోందంటూ ఆరోపించాయి. మరో చోట ర్యాలీలో రైతు మరణంపై ట్వీట్​ చేశారని.. ది వైర్​ ఎడిటర్​పై కేసు నమోదైంది.

author img

By

Published : Feb 1, 2021, 5:29 AM IST

అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్న దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద ఆదివారం పోలీసులు ఓ పాత్రికేయుడిని అరెస్టు చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ఘర్షణలను నివారించడానికి అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులతో కలసి తొలగించడానికి మన్‌దీప్‌ యత్నించారని పోలీసులు తెలిపారు. దీనిపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

''సత్యానికి భయపడేవారే నిజాయతీపరులైన పాత్రికేయులను అరెస్టు చేస్తారు.'' అంటూ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందిస్తూ రైతుల ఆందోళనను ప్రజల ముందుకు తీసుకెళ్తున్న పాత్రికేయులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వ్యాఖ్యానించారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మీడియాను అణగదొక్కుతోందంటూ శిరోమణి అకాలీ దళ్‌ విమర్శించింది.

పలు పాత్రికేయ సంఘాలు కూడా ఈ చర్యను ఖండిస్తూ దిల్లీలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం ముందు నిరసన చేపట్టాయి. కాగా జర్నలిస్టులపై పోలీసుల దురుసు వైఖరిని సీపీఎం కేంద్ర కమిటీ ఆదివారం ఖండించింది.

ర్యాలీలో రైతు మరణంపై ట్వీట్​- ఎడిటర్​పై ఎఫ్​ఐఆర్​

ట్రాక్టర్ల ర్యాలీలో ఓ రైతు మరణించడంపై అవాస్తవాలతో కూడిన ట్వీటు చేశారంటూ ఆన్‌లైన్‌ వార్తా సంస్థ 'ది వైర్‌' ఎడిటర్‌ సిద్ధార్థ్‌ వరదరాజన్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లో కేసు నమోదైంది. గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో నిర్వహించిన ఆ ర్యాలీలో ప్రమాదవశాత్తు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ రైతు మరణించారు. అయితే పోలీసులు కాల్పులు జరపడంతోనే ఆ రైతు చనిపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారని, పోస్టుమార్టం చేసిన వైద్యుల్లో ఒకరు తమకు ఆ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నారని 'ది వైర్' ఓ కథనాన్ని ప్రచురించింది. దాన్ని సిద్ధార్థ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు.

అయితే ఘటనా స్థలానికి సంబంధించి ఆ తర్వాత విడుదలైన సీసీ కెమెరా దృశ్యాల ద్వారా ట్రాక్టర్‌ తిరగబడటంతోనే ఆ రైతు మరణించినట్లు స్పష్టమైంది. ఇదిలా ఉండగా పోస్టుమార్టం చేసిన వైద్యులు అందుకు సంబంధించిన వివరాలను తాము ఆ రైతు కుటుంబ సభ్యులతో కానీ, ఇంకెవరితో కానీ పంచుకోలేదంటూ కొన్నిరోజుల కిందట ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్ధార్థ్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.