ETV Bharat / bharat

హోలీకి సర్కారు గిఫ్ట్.. కోటి మందికి ఉచిత సిలిండర్లు

Free gas cylinder in UP: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు భాజపా సిద్ధం అవుతోంది. ఉచిత గ్యాస్​ సిలిండర్లు.. హోలీ రోజు నుంచే అందించనున్నట్లు సమాచారం.

bjp manifesto
భాజపా మేనిఫెస్టో
author img

By

Published : Mar 14, 2022, 10:34 PM IST

Updated : Mar 14, 2022, 10:40 PM IST

Free gas cylinder in UP: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు భాజపా సిద్ధమైంది. హోలీ రోజు కోటీ మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సుమారు రూ.వెయ్యి కోట్లు అవుతుందని అంచనా. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఈ సిలిండర్లు అందనున్నాయి.

భాజపా మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

60 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు సమాచారం. చదువులో మెరుగ్గా రాణిస్తున్న విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేసే విషయంపైనా భాజపా దృష్టిపెట్టింది.

ఇటీవల జరిగిన ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో మొత్తం 403 నియోజకవర్గాలకుగానూ 273 స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. 125 సీట్లు దక్కించుకున్న ఎస్పీ కూటమి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్ 2 స్థానాలు, బీఎస్పీ ఒక స్థానానికి పరిమితమైంది.

ఇదీ చదవండి: యూపీ కోసం మళ్లీ రంగంలోకి అమిత్ షా

Last Updated : Mar 14, 2022, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.