మధ్యప్రదేశ్‌లోని అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. అనంతరం ఆ చిన్నారిని చెరకు తోటలోని పొదల్లో వదిలేశాడు. కేసు నమోదు చేసుకుని.. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఊరి చివరన ఉన్న పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారి కనిపించింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకుపోయనట్లు ఖండవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. ఈ ఘోరంపై సీఎం కూడా స్పందిచారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖండవాకు జిల్లాలోని జశ్వ్వాడిలో నాలుగేళ్ల చిన్నారని ఓ కామాంధుడు రేప్ చేశాడు. తమ బందువుల ఇంట్లో నుంచి చిన్నారి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు సోమవారం ఫిర్యాదు చేశారు. చిన్నారి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే ఓ తినుబండారాల దుకాణం నడిపే 25 ఏళ్ల వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అతడ్ని విచారించగా.. ఆదివారం రాత్రి బాధితురాలి కుటుంబం దగ్గరి నుంచి మంచాన్ని తీసుకోవడాని వచ్చినట్లు తెలిపాడు. చిన్నారి నిద్రించే సమయంలో అపహరించి.. చెరకు తోటలోకి తీసుకుపోయి ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలిపాడు. అనంతరం చిన్నారిని పొదల్లో విసిరేసినట్లు వెల్లడించాడు. నిందితుడుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ రేప్లో మరో వ్యక్తికి కూడా సంబంధం ఉందని నిందితుడు ఆరోపించాడు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు.
ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమించగా స్థానిక ప్రభుత్వాస్పత్రి నుంచి ఇండోర్‌లోని మరో హాస్పిటల్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని.. బాధితురాలకు మొరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.