ETV Bharat / bharat

4ఏళ్ల చిన్నారిపై హత్యాచారం! చాక్లెట్లు ఇచ్చి రేప్ చేసి, దారుణంగా చంపిన పొరిగింటి యువకుడు - ఒడిశాలోని నాలుగేళ్ల చిన్నారి హత్య

Four Year Girl Murder : నాలుగేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. ఒడిశాలోని భువనేశ్వర్​లో జరిగిందీ ఘటన. అయితే తమ కుమార్తెను పొరుగింటి యువకుడే అత్యాచారం చేసి చంపేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Four Year Girl Murder
Four Year Girl Murder
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 12:26 PM IST

Updated : Nov 7, 2023, 1:15 PM IST

Four Year Girl Murder : ఒడిశాలోని భువనేశ్వర్​లో అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైంది! అయితే తమ కుమార్తెను పొరుగింటి యువకుడే అత్యాచారం చేసి చంపేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్​లోని ఎయిర్​ఫీల్డ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత బాలిక తల్లిదండ్రులిద్దరూ రోజుకూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత రక్తపు మడుగులో ఉన్న కుమార్తె మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శవపరీక్షల నివేదిక వచ్చాకే ఘటనకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన జరిగినట్లు తెలిపారు.

అయితే తమ కుమార్తెపై పొరిగింటి యువకుడు అత్యాచారానికి పాల్పడి, గొంతు కోసి చేశాడని చిన్నారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం సాయంత్రం చిన్నారి చాక్లెట్​ తీసుకుని ఇంట్లోకి వెళ్తున్నట్లు తాను గమనించినట్లు స్థానిక దుకాణ యజమాని పోలీసులకు తెలిపాడు. అదే ప్రాంతానికి చెందిన ఘనియా అనే యువకుడు తన వద్ద రెండు చాక్లెట్లు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

రెండేళ్ల బాలికపై 60ఏళ్ల వ్యక్తి అత్యాచారం..
ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీలో రెండేళ్ల బాలికపై 60ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం బాధితురాలి తల్లి వేరే పని మీద బయటకెళ్లింది. ఆ సమయంలో చిన్నారి తన ఇంటి బయటకు ఆడుకుంది. ఇదే అదనుగా తీసుకున్న నిందితుడు అశోక్ కుమార్ గోస్వామి.. బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం జరిగినదంతా బాలిక.. తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు జరిపించారు.

దారుణ హత్య..
కేరళలోని త్రిసూర్​లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాస్​పోర్టు కార్యాలయ ఆవరణలో ఓ ముఠా కత్తులతో పొడిచి అతడిని చంపేసింది. మృతుడిని శ్రీరాగ్​గా పోలీసులు గుర్తించారు. త్రిసూర్​ జిల్లాలోని ఒలారి నివాసి అయిన శ్రీరాగ్(25).. తన సోదరుడితో కలిసి వేరే పని మీద సోమవారం రాత్రి నగరానికి వచ్చారు. ఆ సమయంలో పాస్‌పోర్టు కార్యాలయ ఆవరణలో కత్తులతో పొడిచి అతడిని కొందరు వ్యక్తులు చంపేశారు. ఘటనలో శ్రీరాగ్​ సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. పూర్తి వివరాలను సమగ్ర విచారణ తర్వాతే వెల్లడిస్తామని అన్నారు.

దారుణం... నాలుగేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

Uttar Pradesh Crime News : మహిళపై గ్యాంగ్​రేప్.. బలవంతంగా విషం తినిపించి హత్య.. చనిపోయే ముందు..

Last Updated : Nov 7, 2023, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.