ETV Bharat / bharat

వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి

అపార్ట్​మెంట్ ఓపెనింగ్ సందర్భంగా వేదిక ఏర్పాటు చేస్తుండగా విద్యుత్​ తీగను తాకి నలుగురు వర్కర్లు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మరో ఘటనలో.. రాజస్థాన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతిచెందారు.

accident in rajasthan
విద్యుత్​తీగను తాకి నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు
author img

By

Published : Apr 8, 2021, 12:37 AM IST

Updated : Apr 8, 2021, 4:02 AM IST

ఓ అపార్ట్​మెంట్​ ప్రారంభోత్సవం సందర్భంగా వేదిక ఏర్పాటు చేస్తుండగా విద్యుత్​తీగ తాకి నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరు అనేకల్లో జరిగింది.

ఇదీ జరిగింది...

అత్తిబెలె-సర్జాపూర్ రోడ్ ఇండ్లబెలె ప్రాంతంలో ఇటీవలే నిర్మించిన జీఆర్ కల్చర్ అపార్ట్​మెంట్​ ఓపెనింగ్​ కోసం ఓ వేదిక ఏర్పాటు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అనుకోకుండా 11కేవీ విద్యుత్​ తీగను తాకి నలుగురు వర్కర్లు మృతిచెందగా.. ఇద్దరు కోమాలోకి వెళ్లారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితులు యడవణహళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

మరో ఘటనలో నలుగురు..

రాజస్థాన్ నాగౌర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ద్విచక్రవాహనాలపై వెళ్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. బుధవారం రాత్రి లంగౌడ్​ జాతీయ రహదారి 458పై ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఒడిశాలో ఎన్​కౌంటర్​- నక్సల్స్​ క్యాంపులు ధ్వంసం

Last Updated : Apr 8, 2021, 4:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.