కొవిడ్ కారణంగా బిహార్ భాజపా ఎమ్మెల్సీ హరి నారాయణ్ చౌదరి మృతిచెందారు. పట్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
చౌదరి(77) కొవిడ్ సోకడం వల్ల.. వారం క్రితం ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేరారు.
ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక కార్యక్రమాల్లో మిక్కిలి ఆసక్తి చూపే అతి తక్కువ మందిలో హరి నారాయణ్ ఒకరని కొనియాడారు.
ఆర్జేడీ మాజీ ఎంపీ కన్నుమూత
జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ కరోనా కారణంగా మృతిచెందారు. దిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు దిల్లీ జైళ్ల శాఖ తెలిపింది.
![RJD former MP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11600301_sh3.jpg)
ఓ హత్య కేసులో షాబుద్దీన్ జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఏప్రిల్ 20న ఆయనకు కొవిడ్ సోకింది.
ఇదీ చదవండి:'రాష్ట్రాల వద్ద ఇంకా 79 లక్షల టీకాలు'