జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా.. శ్రీనగర్ ఆసుత్రిలో చేరారు. మార్చి 30న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఫరూక్‌ను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
''కరోనా బారిన పడిన నా తండ్రికి మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యుల సలహా మేరకు శ్రీనగర్ ఆసుపత్రికి తరలించాం. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, మా కుటుంబానికి మద్దతు తెలుపుతూ సందేశాలు పంపిన వారందరికీ కృతజ్ఞతలు.''
- ఒమర్ అబ్దుల్లా
ఫరూక్ అబ్దుల్లా త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ఆకాంక్షించారు.
ఫరూక్ అబ్దుల్లా మార్చి 2న కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్