మలంకర మర్ థోమ సిరియన్ చర్చి మాజీ పాస్టర్, భారత్లో ఎక్కువ కాలం బిషప్గా పనిచేసిన డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ మృతిచెందారు. 103 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా ఆయన కుంబానంద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరపనున్నారు.
![Dr Phillipose Mar Chrysostom](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/modi_metropolitan2704177167_0505newsroom_1620181786_162.jpg)
ప్రపంచలోనే ఎక్కువ కాలం బిషప్గా పనిచేసిన ఘనత డా. ఫిలిప్పోస్ సొంతం. ఈయన 68 ఏళ్లపాటు బిషప్గా పనిచేశారు. 1999లో ఈయన మలంకర మర్ థోమ సిరియన్ చర్చ్ పెద్దగా 1999లో నియమితులయ్యారు. 2018లో ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషన్ అవార్డను పొందారు.
![Dr Phillipose Mar Chrysostom](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mar-chrysostom_0505newsroom_1620181786_767.jpg)
డాక్టర్. ఫిలిప్పోస్ మర్ క్రిసోస్టమ్ ఏప్రిల్ 27 1918లో జన్మించారు. 1944లో మథోమా చర్చి ప్రీస్ట్ అయ్యారు.
ఇదీ చదవండి:'ఓడిపోయినప్పటికీ సీఎం పదవి ఎలా చేపడతారు'