తమిళనాడు మాజీ మంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ నేత ఎం.మణికందన్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. మలేసియాకు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటం, ఆమె గర్భస్రావానికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు, సదరు మహిళను మణికందన్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో మణికందన్‌కు.. మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిందని తమిళనాడు పోలీసులు తెలిపారు. దీంతో గత కొన్నాళ్లుగా అరెస్టు నుంచి తప్పించుకుంటున్న ఆయన్ను బెంగళూరులో అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి: మంత్రి బంధువు ఇంట్లో రూ.11 కోట్ల అక్రమ నగదు